Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూఢిల్లీ తీర్మానం ఆమోదంతో చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం: ప్రధాన మంత్రి


   న్యూఢిల్లీ తీర్మానం ఆమోదం పొందడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్మానానికి జి-20 సభ్యదేశాలన్నీ మద్దతివ్వడంతోపాటు సహకరించడంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

   ఈ మేరకు దేశాధినేతల న్యూఢిల్లీ తీర్మానం డిజిటల్‌ ప్రతిని ‘ఎక్స్‌’ ద్వారా పోస్ట్‌ చేస్తూ పంపిన సందేశంలో:

“న్యూఢిల్లీలో దేశాధినేతల తీర్మానానికి ఆమోదం ద్వారా చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఏకాభిప్రాయం, స్ఫూర్తితో ఐక్యంగా/మెరుగైన/సుసంపన్న సామరస్యపూర్వక భవిష్యత్తు కోసం సహకారాత్మక కృషి కొనసాగిస్తామని మేం ప్రతినబూనుతున్నాం. ఇందుకు మద్దతు పలకడంతోపాటు సహకరించిన జి-20 సభ్యదేశాల అధినేతలందరికీ నా కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు.

 

***

DS/TS