Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బేటరీ ఎనర్జీస్టోరేజ్ సిస్టమ్స్ (బిఇఎస్ఎస్) యొక్క అభివృద్ధి కి గాను వాయబిలిటీ గ్యాప్ ఫండింగ్అని పేరు పెట్టిన ఒక పథకాని కి ఆమోదాన్ని తెలిపిన మంత్రిమండలి


బేటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (బిఇఎస్ఎస్) ను అభివృద్ధి పరచడం కోసం ఉద్దేశించి న వాయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (విజిఎఫ్) స్కీము కు గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని తెలిపింది. ఆమోదాన్ని ఇచ్చిన ఈ పథకం లో భాగం గా, మూలధన వ్యయం లో 40 శాతం వరకు ఆర్థిక సహాయాన్ని వాయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (విజిఎఫ్) రూపం లో బడ్జెటరీ సపోర్టు గా అందజేయాలని ప్రతిపాదించడమైంది. ఈ పథకం ద్వారా 4,000 ఎమ్ డబ్ల్యుహెచ్ లతో కూడిన బిఇఎస్ఎస్ ప్రాజెక్టుల ను 2030-31 కల్లా అభివృద్ధిపరచడం జరుగుతుంది. ప్రభుత్వం చేపట్టిన పర్యావరణ అనుకూల చర్య ల పొడవాటి జాబితా లో ఒక మహత్తర చర్య అని చెప్పదగిన ఈ చర్య, బేటరీ నిలవ వ్యవస్థ ల కు అయ్యే వ్యయాన్ని తగ్గించడం తో పాటుగా వాటి యొక్క లాభదాయకత ను పెంచుతుందన్న ఆశ కూడా ఉంది.

సౌర విద్యుత్తు మరియు పవన విద్యుత్తు ల వంటి నవీకరణ యోగ్య శక్తి వనరుల సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం కోసం రూపుదిద్దిన ఈ పథకం లక్ష్యమల్లా స్వచ్ఛమైనటువంటి, ఆధారపడదగినటువంటి మరియు తక్కువ ఖర్చు తో కూడిన టువంటి విద్యుత్తు ను పౌరుల కు అందజేయాలన్నదే. 3,760 కోట్ల రూపాయల మేరకు బడ్జెటరీ సపోర్టు సహా 9,400 కోట్ల రూపాయల ఆరంభిక పెట్టుబడి తో తలపెట్టిన బిఇఎస్ఎస్ స్కీమ్ తాలూకు విజిఎఫ్ చాలా కాలం పాటు ఉపయోగం లో ఉండే శక్తి సంబంధి పరిష్కారాల పట్ల ప్రభుత్వం యొక్క వచనబద్ధత ను స్పష్టంచేస్తోంది. విజిఎఫ్ రూపేణా సమర్థన ను ఇవ్వజూపడం ద్వారా, ఈ పథకం ఒక్కో కిలో వాట్-అవర్ (కెడబ్ల్యుహెచ్) కు 5.50-6.60 రూపాయల శ్రేణి లో లెవెలైజ్ డ్ కాస్ట్ ఆఫ్ స్టోరేజ్ (ఎల్ సిఒఎస్) ను సాధించాలి అని లక్ష్యం గా పెట్టుకొంది. దేశవ్యాప్తం గా విద్యుత్తు కు గిరాకీ బాగా ఎక్కువ గా ఉండే సందర్భాల లో నిలవ చేసిన నవీకరణ యోగ్య శక్తి అనేది ఒక ఆచరణీయమైన ఐచ్ఛికం గా తన వంతు పాత్ర ను పోషిస్తుంది. బిఇఎస్ఎస్ ప్రాజెక్టుల అమలు లో వేరు వేరు దశల కు ముడి పెట్టి విజిఎఫ్ ను అయిదు విడతల లో అందించడం జరుగుతుంది.

ఈ పథకం తాలూకు లాభాలు వినియోగదారుల కు అందేటట్లుగా చూడడాని కి బిఇఎస్ఎస్ ప్రాజెక్టు సామర్థ్యం లో కనీసం గా 85 శాతం సామర్థ్యాన్ని డిస్ట్రిబ్యూశన్ కంపెనీస్ (డిస్కమ్స్) కు అందించడం జరుగుతుంది. ఇది నవీకరణ యోగ్య శక్తి ని విద్యుత్తు గ్రిడ్ లో జతపరచే అవకాశాల ను వృద్ధి చెందింపచేయడం ఒక్కటే కాకుండా ప్రసారం సంబంధి నెట్ వర్క్ ల వినియోగం వీలైనంత ఎక్కువ స్థాయి లో ఉండేటట్లు చూసుకొంటూనే వ్యర్థాల ను కనీస స్థాయి కి పరిమితం చేయగలుగుతుంది. ఫలితం గా, ఇది బాగా ఎక్కువ ఖర్చు తో కూడినటువంటి మౌలిక సదుపాయాల సంబంధి ఉన్నతీకరణ ఆవశ్యకత ను తగ్గించివేస్తుంది.

విజిఎఫ్ గ్రాంటుల కు గాను బిఇఎస్ఎస్ డెవలపర్ ల ఎంపిక ను పారదర్శకమైన స్పర్థాత్మక బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా చేపట్టి, సార్వజనిక రంగ సంస్థల కు మరియు ప్రైవేటు రంగ సంస్థల కు సమానమైన అవకాశాలు లభించేటట్లు జాగ్రత తీసుకోవడం జరుగుతుంది. ఈ వైఖరి ఆరోగ్య ప్రదమైన పోటీ ని వృద్ధి చెందింప చేస్తుంది; దీనితో పాటు గా, బిఇఎస్ఎస్ కై ఒక పటిష్టమైన ఇకోసిస్టమ్ ను ప్రోత్సహిస్తుంది; చెప్పుకోదగిన స్థాయి లో పెట్టుబడుల ను ఆకర్షిస్తుంది, ఇంకా అనుబంధ పరిశ్రమల లో అవకాశాల ను ప్రసాదిస్తుంది.

స్వచ్ఛమైన ఎనర్జీ సొల్యూశన్స్ ను మరియు గ్రీన్ ఎనర్జీ సొల్యూశన్స్ ను ప్రోత్సహించాలని భారతదేశం ప్రభుత్వం కంకణం కట్టుకొంది, మరి ఈ దార్శనికత ను సాకారం చేసే దిశ లో ఒక ముఖ్యమైనటువంటి చర్య గా బిఇఎస్ఎస్ స్కీము ఉంది. నవీకరణ యోగ్య శక్తి బలాన్ని వినియోగించుకోవడం ద్వారాను మరియు బేటరీ నిలవ పద్ధతి ని అనుసరించడం ద్వారాను పౌరులు అందరికీ ఒక ఉజ్వలమైనటువంటి మరియు హరిత ప్రధానమైనటువంటి భవిష్యత్తు ను ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం గా ఉంది.

 

***