Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత్ మండపం లో ఏర్పాటు చేసిన నటరాజ ప్రతిమ భారతదేశం యొక్క శతాబ్దాల నాటి ప్రాచీన కళాత్మకత కు మరియు సంప్రదాయాల కు ఒక తార్కాణం గా నిలువబోతోంది: ప్రధాన మంత్రి


భారత్ మండపమ్ లో ఏర్పాటు చేసిన భవ్యమైనటువంటి నటరాజ ప్రతిమ భారతదేశం యొక్క సమృద్ధమైన చరిత్ర ను మరియు సంస్కృతి ని కళ్ళ కు కట్టే ఒక నిదర్శన గా ఉన్నదని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఇందిరా గాంధీ నేశనల్ సెంటర్ ఫార్ ఆర్ట్స్ ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ –

‘‘భారత్ మండపమ్ లో భవ్యమైనటువంటి నటరాజ ప్రతిమ మన సంపన్నమైన చరిత్ర  మరియు సంస్కృతి ల తాలూకు విభిన్నమైన పార్శ్వాల ను సజీవంగా నిలబెడుతున్నది.  ప్రపంచ దేశాలు జి-20 శిఖర సమ్మేళనాని కి కొలువుదీరనున్న వేళ లో, ఇది భారతదేశం యొక్క శతాబ్దాల పురాతనమైనటువంటి కళాత్మకత ను మరియు సంప్రదాయాల ను కళ్లకు కట్టేటటువంటి ఒక నిదర్శన గా ఉండనుంది.’’ అని పేర్కొన్నారు.