Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్-2023’లో ‘ఆర్‌బిఐ’ గవర్నర్‌ శక్తికాంత దాస్‌కు “ఎ+” రేటింగ్ లభించడంపై ప్రధానమంత్రి అభినందన


   గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్-2023లో భారత రిజర్వు బ్యాంకు గవర్నర్‌ శ్రీ శక్తికాంత దాస్‌కు “ఎ+” ర్యాంకు లభించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ సంస్థ రేటింగ్ పొందిన ముగ్గురు కేంద్రీయ బ్యాంకు గవర్నర్లలో శ్రీ దాస్ “ఎ+”తో అగ్రస్థానంలో నిలిచారు.

ఈ మేరకు రిజర్వు బ్యాంకు ‘ఎక్స్‌’ ద్వారా చేసిన పోస్టుపై స్పందిస్తూ పంపిన సందేశంలో:

“భారత రిజర్వు బ్యాంకు గవర్నర్‌ శ్రీ శక్తికాంత దాస్‌కు అభినందనలు. ప్రపంచ యవనికపై మన ఆర్థిక నాయకత్వ ప్రతిష్టను ప్రతిబింబించిన ఈ క్షణం భారతదేశానికే ఎంతో గర్వకారణం. మన దేశ వృద్ధిపథాన్ని బలోపేతం చేయడంలో ఆయన అంకితభావం-దృక్పథం మరింత కాలం కొనసాగుతాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.