జాబిల్లి చెంతకు చేరుకోవడం కోసం తలపెట్టిన చంద్రయాన్-3 మిశన్ యొక్క చరిత్రాత్మక సాఫల్యాన్ని ఘనం గా జరుపుకోవడాని కి దేశ ప్రజల తో కేంద్ర మంత్రిమండలి చేతులు కలిపింది. మన శాస్త్రవేత్తల బ్రహ్మాండమైన కార్యసాధన ను మంత్రిమండలి ప్రశంసించింది. ఇది మన అంతరిక్ష సంస్థ కు లభించిన విజయం ఒక్కటే కాదని, ఇది భారతదేశం యొక్క పురోగతి లో ఒక ప్రకాశవంతమైన సూచిక మరియు ప్రపంచ రంగస్థలం లో ఒక ఉన్నతమైన సోపానం గా కూడా ఉంది. ఆగస్టు 23 వ తేదీ ని ‘‘జాతీయ అంతరిక్ష దినం’’ గా ఘనం గా పాటించడం జరుగుతుందని మంత్రిమండలి పేర్కొంది.
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఐఎస్ఆర్ఒ.. ‘ఇస్ రో’) కు, ఆ సంస్థ యొక్క ప్రయాసల కు గాను మంత్రివర్గం అభినందనల ను తెలియ జేసింది. మన శాస్త్రవేత్తల సౌజన్యం తో భారతదేశం చంద్రుని దక్షిణ ధృవం సమీపం లో అడుగిడిన ఒకటో దేశం గా భారతదేశం ఖ్యాతి ని గడించింది. జాబిల్లి పై కాలుపెట్టే ఘట్టం దానంతట అదే ఒక మహత్తరమైన కార్యసిద్ధి అని చెప్పాలి. చందమామ దక్షిణ ధృవం సమీపం లో కాలూనడం మన శాస్త్రవేత్త ల యొక్క ఉత్సాహాని కి ఒక నిదర్శనం. వారు శతాబ్దాల తరబడి మానవ జ్ఞానాని కి ఉన్న ఎల్లలను చెరిపివేసేందుకు ప్రయత్నించారు. ‘ప్రజ్ఞాన్’ రోవర్ చంద్రుని కి సంబంధించిన సమాచార ఖజానా ను కొంచెం కొంచెం గా చేరవేస్తూ ఉండటం సంబంధిత జ్ఞానాన్ని విస్తరిస్తూ, చంద్రగ్రహం తాలూకు రహస్యాల ను చేధించడం తో పాటుగా, అపూర్వమైన విషయాల ను కనుగొనేందుకు బాట ను పరచగలదు.
సాంకేతిక విజ్ఞానం పరం గా త్వరితగతిన నమోదు అవుతున్న పురోగతి మరియు నూతన ఆవిష్కరణల పట్ల తహతహలు ఒక ఆనవాయితీ గా మారిన యుగం లో భారతదేశం యొక్క శాస్త్రవేత్తలు జ్ఞానాని కి, సమర్పణ భావాని కి మరియు ప్రావీణ్యాని కి ఉజ్వల మార్గదర్శులు గా నిలచారని మంత్రిమండలి గట్టిగా నమ్ముతున్నది. వారి యొక్క విశ్లేషణ సామర్థ్యం ప్రతిదీ తరచి చూసే మరియు ఆరా తీసే తరగని నిబద్ధతలు దేశాన్ని ప్రపంచం లో విజ్ఞాన శాస్త్ర సంబంధి కార్యసిద్ధుల పరంపర లో అగ్రగామి గా నిలచేందుకు తోడ్పడుతూ వచ్చాయి. ఉత్కృష్టత సాధన లో వారు పట్టువిడువక ప్రదర్శిస్తున్న తెగువ ఎక్కడా తలొగ్గని తపన, సవాళ్ళ ను అధిగమించాలనే అజేయమైన ఉత్సాహం అంతర్జాతీయ యవనిక పైన వారి ప్రతిష్ట ను దృఢతరం చేయడం ఒక్కటే కాకుండా, అన్యులు కూడా పెద్ద పెద్ద కలల ను కనడం మరియు ప్రపంచం లో జ్ఞానం యొక్క విశాల ముఖచిత్రాని కి వారి వంతు గా తోడ్పాటును అందించడాని కి తగిన ప్రేరణ ను కూడా అందించాలి.
చంద్రయాన్-3 విజయం లో మహిళా శాస్త్రవేత్తలు పెద్ద సంఖ్య లో వారి యొక్క తోడ్పాటును అందించడం చూస్తే మంత్రిమండలి కి అది ఒక గర్వకారణం గా ఉంది. అంతేకాదు, అది రాబోయే కాలాల్లో మహత్వాకాంక్ష కలిగిన మహిళా శాస్త్రవేత్తలు అనేక మంది కి స్ఫూర్తిని ఇవ్వనున్నది.
భారతదేశం యొక్క అంతరిక్ష కార్యక్రమం మానవ సంక్షేమం కోసం మరియు విజ్ఞాన శాస్త్ర సంబంధి ప్రగతి కోసం అండగా నిలవాలన్న భారతదేశం యొక్క అచంచలమైనటువంటి తోడ్పాటుకు తోడు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క దార్శనికత మరియు మార్గదర్శక ప్రాయమైనటువంటి నాయకత్వాల ను మంత్రిమండలి అభినందిస్తోంది. మన శాస్త్రవేత్తల సత్తా పట్ల ఆయన కు ఉన్న విశ్వాసం మరియు నిరంతరాయ ప్రోత్సాహం వారి లో ఉత్సాహాన్ని ఇంతలంతలు చేసివేస్తూ వస్తున్నాయి.
తొలుత గుజరాత్ రాష్ట్రం, మరి ఆ తరువాత ప్రధాన మంత్రి గా 22 సంవత్సరాల సుదీర్ఘ కాలం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి చంద్రయాన్ మిశన్ లు అన్నింటితో భావోద్వేగ పరమైన అనుబంధం ఉంది. పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయీ గారు ఆ తరహా మిశన్ ను ఒకదానిని గురించి ఆలోచన చేసినప్పుడు శ్రీ నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి గా సేవల ను అందిస్తూ ఉన్నారు. చంద్రయాన్-1 ని 2008 వ సంవత్సరం లో ఫలప్రదం గా ప్రారంభించడం జరిగిన వేళ ఆయన ఇస్రో ను సందర్శించి శాస్త్రవేత్తల కు తన అభినందనల ను వ్యక్తం చేశారు. 2019వ సంవత్సరం లో చంద్రయాన్-2 విషయాని కి వస్తే భారతదేశం అంతరిక్ష రంగం లో జాబిల్లి ఉపరితలాని కి కేవలం కొన్ని అడుగుల దూరం వరకు భారతదేశాన్ని చేర్చింది. ప్రధాన మంత్రి యొక్క విచక్షణ భరితమైన నాయకత్వం మరియు ఆప్యాయతలు శాస్త్రవేత్తల లో ఉత్సాహాన్ని ఇనుమడింపజేసి వారిని కృతనిశ్చయులు గా తీర్చిదిద్ది, మరి వారు ఈ మిశన్ ను మరింత విశాలమైన ఉద్దేశ్యాల కోసం అనుసరించేటట్లుగా వారిలో ప్రేరణ ను నింపింది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎల్లవేళలా విజ్ఞాన శాస్త్రాన్ని మరియు నూతన అన్వేషణల ను ప్రోత్సహిస్తూ వచ్చారు. గడచిన తొమ్మిది సంవత్సరాల లో ప్రవేశపెట్టిన అనేక సంస్కరణలు పరిశోధనల ను, నూతన ఆవిష్కరణల ను సులభతరం చేసి వేశాయి. అంతరిక్ష రంగం లో ప్రైవేటు రంగాని కి మరియు మన స్టార్ట్-అప్ సంస్థల కు మరిన్ని అవకాశాలు దక్కేటట్లుగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చర్యలు తీసుకున్నారు. ఇన్-స్పేస్ (IN-SPACe)ను అంతరిక్ష విభాగం అధీనం లో పని చేసే ఒక స్వతంత్ర సంస్థ గా ఏర్పాటు చేయడం ద్వారా పరిశ్రమ సంబంధి ఇకో-సిస్టమ్ ను సృష్టించడం జరిగింది. 2020 వ సంవత్సరం జూన్ లో గ్లోబల్ స్పేస్ ఇకానమి లో ఒక ప్రధానమైన వాటా ను దక్కించుకోవాలనే ఉద్దేశ్యం కూడా ఉండింది. అది అంతరిక్ష జగతి లో భారతదేశం యొక్క పురోగతి కి ఒక మెట్టుగా మారింది. హ్యాకథన్ లపై శ్రద్ధ తీసుకోవడం తో భారతదేశం లో యువతీ యువకుల కు అనేక అవకాశాల కు తలుపులు తెరుచుకొన్నాయి.
చంద్రుని ఉపరితలం పైన రెండు బిందువుల కు ‘తిరంగా’ పాయింట్’ (చంద్రయాన్-2 యొక్క పాదముద్ర) మరియు ‘శివశక్తి’ పాయింట్ (చంద్రయాన్-3 అడుగుపెట్టిన ప్రదేశం) లకు నామకరణం చేయడాన్ని మంత్రిమండలి స్వాగతిస్తున్నది. ఈ పేరులు మన గత కాలం యొక్క సారాన్ని ఎంతో సుందరమైన రీతి లో ప్రతిబింబిస్తున్నాయి. అదే కాలం లో ఆధునికత కు కూడా పెద్దపీట వేస్తున్నాయి. ఈ పేరులు కేవలం నామాలు మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ. అవి వేల సంవత్సరాల మన విజ్ఞాన శాస్త్ర మహత్వాకాంక్షల సంప్రదాయం తో పెనవేసుకొన్న లంకెలు.
చంద్రయాన్-3 యొక్క సాఫల్యం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన ‘‘జయ్ విజ్ఞాన్, జయ్ అనుసంధాన్’’ నినాదాని కి గొప్ప ప్రమాణాల లో ఒకటి గా ఉంది. అంతరిక్ష రంగం ఇక మీదట భారతదేశం లో వర్థిల్లుతున్న స్టార్ట్-అప్ సంస్థల కు మరియు ఎమ్ఎస్ఎమ్ఇ లకు ఇతోధిక అవకాశాల ను ఇవ్వజూపడమే కాకుండా, లక్షల కొద్దీ నౌకరీల ను కల్పిస్తుంది. క్రొత్త క్రొత్త విషయాల ను కనుగొనేందుకు దారిని పరుస్తుంది. ఇది భారతదేశం లో యువత కు సంభావ్యత ల నిధిని ప్రసాదిస్తుంది.
చంద్రయాన్-3 మిశన్ యొక్క విజయం తో అందేటటువంటి జ్ఞానాన్ని మానవాళి మేలుకు మరియు పురోగతి కి ఉపయోగించడం జరుగుతుందని నిర్వివాదం గా వెల్లడి చేస్తున్నాం. మరీ ముఖ్యం గా అంతగా అభివృద్ధి చెందని దేశాల విషయం లో ఇది జరుగుతుంది. ‘వసుధైవ కుటుంబకం’ పట్ల మనకు ఉన్నటువంటి చిరకాలిక విశ్వాసం యొక్క స్ఫూర్తి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరోమారు నిరూపించడం జరిగింది. భారతదేశం లో పురోగతి యొక్క జ్యోతులు ఇతర దేశాల లో ప్రజల జీవనాన్ని సైతం కాంతులీనేటట్లు చేస్తూ ఉంటుంది.
అంతరిక్ష రంగం లో భారతదేశం వేస్తున్న ముందంజలు కేవలం విజ్ఞాన శాస్త్ర సంబంధి మహత్తర కార్యసాధనల కంటే మించినవని మంత్రిమండలి నమ్ముతున్నది. అవి పురోగతి యొక్క, ఆత్మనిర్భరత యొక్క మరియు ప్రపంచ నేతృత్వం యొక్క దృష్టికోణాని కి ప్రాతినిధ్య వహిస్తున్నాయి. ఇవి ఉదయిస్తున్నటువంటి ‘న్యూ ఇండియా’ ఒక ప్రతీక గా కూడా ఉంది. ఈ అవాకాశాన్ని మరిన్ని అనుకూలతల ను సృష్టించడం కోసం వినియోగించుకోవాలని మన తోటి పౌరుల కు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ క్రమం లో మానవనిర్మిత ఉపగ్రహ సమాచార వ్యవస్థ మొదలుకొని, వాతావరణ అధ్యయనం నుండి వ్యవసాయం వరకు, ఇంకా విపత్తుల నిర్వహణ తదితర రంగాల లో ఈ అవకాశాలను కల్పించడానికి వీలు ఉంది. మన నూతన ఆవిష్కరణలు క్షేత్ర స్థాయి లో ఉపయోగం లోకి వచ్చేటట్లు మన మౌలిక సదుపాయాల ను వృద్ధి చెందింప చేసేటట్లు మన డిజిటల్ ఇకానమి కి అండదండల ను అందించేటట్లు మరియు విభిన్న రంగాల కు కీలకమైన డేటా ను అందుబాటు లోకి తీసుకొని వచ్చేటట్లు మనం చూడాలి.
విజ్ఞానం శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, ఇంకా నూతన ఆవిష్కరణల తో కూడిన ఈ యుగం లో మంత్రిమండలి ప్రత్యేకం గా విద్య జగతి తో అనుబంధం కలిగిన వర్గాని కి చేస్తున్న విజ్ఞప్తి ఏమిటి అంటే, అది మరింత మంది యువజనులు విజ్ఞాన శాస్త్రం వైపు మళ్ళేటట్లుగా వారి లో ప్రేరణ ను పాదుగొల్పాలన్నదే. చంద్రయాన్-3 యొక్క సాఫల్యం ఈ రంగాల లో ఆసక్తి తాలూకు అగ్గిరవ్వ ను రాజేయడాని కి ఒక బ్రహ్మాండమైన తరుణోపాయాన్ని అందించింది. అంతేకాదు, మన దేశం లో అవకాశాల తాలూకు తలుపుల ను కూడా బార్లా తెరచింది.
ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి మిశన్ కు ఎవరెవరైతే తోడ్పాటును అందించారో, వారందరికీ పేరు పేరునా ఈ మంత్రివర్గం ప్రశంసల ను మరియు అభినందనల ను వ్యక్త పరుస్తున్నది. చంద్రయాన్-3 అనేది భారతదేశం మక్కువ తోను, దృఢ దీక్ష తోను, అంచంచలమైనటువంటి సమర్పణ భావం తోను ఏమి సాధించగలదు అనేదానికి ఒక ప్రకాశవంతమైన నిదర్శన గా నిలుస్తున్నది. ఈ దేశం యొక్క పౌరులు వారి హృదయాల లో సంతోషం మరియు అభిమానం పొంగి పొర్లుతూ ఉండగా, భారతదేశాన్ని 2047వ సంవత్సరాని కల్లా ఒక అభివృద్ధి చెందినటువంటి దేశం గా ఆవిష్కరించడాని కి వారిని వారు పునరంకితం చేసుకొంటారని కూడా మంత్రిమండలి తన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నది.
****