ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్, పిపిపి నమూనాలో సిటీ బస్ కార్యకలాపాలను మరింత పెంచేందుకు , పిఎం –ఈ బస్ సేవా బస్ పథకానికి ఆమోదం తెలిపింది.
ఈ పథకం వ్యయం రూ 57,613 కోట్లు. ఇందులో రూ 20,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. ఈ పథకం పది సంవత్సరాల పాటు బస్ కార్యకలాపాలకు మద్దతునిస్తుంది.
సేవలు అందుబాటులో లేని ప్రాంతాలకు సేవలు:
ఈ పథకం 2011 జనాభా లెక్కల ప్రకారం మూడు లక్షలు, అంతకు పైబడిన జనాభా గల నగరాలకు వర్తిస్తుంది. ఇందులో కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన అన్ని రాజధాన నగరాలు ,ఈశాన్య , కొండ ప్రాంత రాష్ట్రాల రాజధానులు ఉన్నాయి.
ఈ పథకం కింద వ్యవస్థీకృత బస్సు సేవలు లేని ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తారు.
ప్రత్యక్ష ఉపాధి కల్పన:
ఈ పథకం కింద సుమారు 10 వేల సిటీ బస్ సర్వీసులను నడపడం ద్వారా , 45,000 నుంచి 55,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది.
ఈ పథకానికి రెండు విభాగాలు ఉన్నాయ.
సెగ్మెంట్ ఎ– సిటీ బస్ సేవల పెంపు : (169 నగరాలు):
ఆమోదిత బస్ పథకం కింద 10,000 ఈ బస్‌లను పబ్లిక్ – ప్రైవేట్ భాగస్వామ్యం కింద పిపిపి పద్ధతిలో నడుపుతారు. ఇది సిటీ బస్ సేవలను పెంచుతుంది.
ఇందుకు అనుబంధంగా అభివృద్ధి, డిపో మౌలికసదుపాయాల పెంపు, ఈ బస్ లకోసం సబ్ స్టేషన్ల నిర్మాణం వంటివి కల్పించడం జరుగుతుంది.
సెగ్మెంట్ బి – గ్రీన్ అర్బన్ మొబిలిటీ ఇనిషియేటివ్ (జియుఎంఐ) : (181 నగరాలు).
ఈ పధకం కింద, బస్ ప్రాధాన్యత, మౌలికసదుపాయాలు, మల్టీ మోడల్ ఇంటర్ ఛేంజ్ సదుపాయాలు, ఎన్.సి.ఎం.సి ఆధారిత ఆటోమేటెడ్ చార్జీల వసూలు వ్యవస్థ, చార్జీల వసూలు మౌలిక సదుపాయాలు కల్పిస్తారు.
బస్ సర్వీసుల నిర్వహణకు మద్దతు : ఈ పథకం కింద , రాష్ట్రాలు, నగరాలు బస్ సర్వీసులు నడపడం, బస్ ఆపరేటర్లకు చెల్లింపులు చేసే బాధ్యత కలిగి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఈ బస్ నిర్వహణ కార్యకలాపాలకు
ప్రతిపాదిత పథకంలో పేర్కొన్న మేరకు సబ్సిడీని అందించి అండగా నిలుస్తుంది.
ఈ –మొబిలిటీకి ఊపు:
––ఈ పథకం ఈ– మొబిలిటిని ప్రోత్సహిస్తుంది. ఇది మీటర్ పవర్‌కు ముందు స్థాయిలో మౌలిక సదుపాయాలను పెంపొందిస్తుంది.
––గ్రీన్ మొబిలిటి చొరవ కింద చార్జింగ్ మౌలికసదుపాయాల అభివృద్ధికి వివిధ నగరాలకు మద్దతు నివ్వడం జరుగుతుంది.
–– బస్ ప్రాధాన్యతా మౌలిక సదుపాయాలకు మద్దతు తో అత్యధునాతన, ఇంధన సామర్థ్యం గల విద్యుత్ బస్ లతో పాటు, ఈ మొబిలిటీ రంగంలో ఆవిష్కరణలకు దోహదపడుతుంది. ఇది విద్యుత్ వాహనాల సరఫరా చెయిన్
అభివృద్ధికి నూతన ఆవిష్కరణలకు ఉపకరిస్తుంది.
–– ఈ పథకం కింద ఈ బస్‌ల కోసం విద్యుత్ బస్‌లను పెద్ద ఎత్తున సేకరించడం, పెద్ద ఎత్తున ఆర్థిక కార్యకలాపానికి దోహదపడుతుంది.
–– ఎలక్ట్రిక్ బస్ లలో ప్రజా రవాణా వల్ల వాయు కాలుష్యం తగ్గడమే కాక, శబ్ద కాలుష్యం తగ్గుతుంది, కర్బన ఉద్గారాలు తగ్గుతాయి.
––బస్ ఆధారిత ప్రజా రవాణా పెరిగినందువల్ల, రవాణా పద్ధతిలో మార్పు వచ్చి, అది జిహచ్జి తగ్గడానికి ఉపయోగపడుతుంది.
***
PM-eBus Sewa will redefine urban mobility. It will strengthen our urban transport infrastructure. Prioritising cities without organised bus services, this move promises not only cleaner and efficient transport but also aims to generate several jobs.https://t.co/4wbhjhCMjI https://t.co/WROR0LxTIy
— Narendra Modi (@narendramodi) August 16, 2023