ఎర్రకోటలో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘జన్ ఔషధి కేంద్రాల’ సంఖ్యను 10,000 నుండి 25,000కి పెంచాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు.
జన్ ఔషధి కేంద్రాలు మధ్యతరగతి ప్రజలకు ప్రత్యేక శక్తిని ఇచ్చాయన్నారు. ఎవరికైనా మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ అయితే నెలవారీ బిల్లు రూ.3000 ఆదా అవుతుందని చెప్పారు.
రూ.100 ధర ఉన్న మందులను జన్ ఔషధి కేంద్రాల ద్వారా రూ.10 నుంచి రూ.15కే ఇస్తున్నామని ప్రధాని తెలిపారు.
సాంప్రదాయ నైపుణ్యాలు కలిగిన వారి కోసం వచ్చే నెలలో ₹13,000 నుండి 15,000 కోట్ల కేటాయింపుతో విశ్వకర్మ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ‘జన్ ఔషధి కేంద్రం’ (సబ్సిడీ మందుల దుకాణాలు) 10,000 నుండి 25,000 కు పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
***