న్యూ ఢిల్లీ లో జరిగిన స్వాతంత్ర్య దినం సంబంధి కార్యక్రమాల లో భాగం గా, దేశ వ్యాప్తం గా 50 మంది నర్సుల ను వారి కుటుంబ సభ్యుల తో పాటు గా ఎర్ర కోట యొక్క బురుజుల లో సాగిన కార్యక్రమం లో విశిష్ట అతిథుల వలె పాలుపంచుకోవలసింది గాను, ఆ కార్యక్రమాల ను తిలకించవలసింది గాను ఆహ్వానించడమైంది. ఈ ప్రత్యేకమైనటువంటి అతిథుల లో సర్ పంచ్ లు, గురువు లు, రైతులు మరియు మత్స్యకారుల మొదలుకొని జీవనం లోని విభిన్న రంగాల కు చెందిన 1800 విశేష అతిథులు కూడా పాల్గొన్నారు.
దేశం యొక్క భాగ్యాన్ని మార్చివేసే ప్రయత్నాల ను చేస్తున్నందుకు గాను నర్సుల ను, డాక్టర్ లను మరియు ఇతరుల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. మనుషుల ను కేంద్ర స్థానం లో అట్టిపెట్టుకొనే దృష్టికోణం ఉంటే తప్ప ప్రపంచం యొక్క అభివృద్ధి సాధ్యం కాదు అని కోవిడ్ మనకు నేర్పించింది ఆయన అన్నారు.
Addressing the nation on Independence Day. https://t.co/DGrFjG70pA
— Narendra Modi (@narendramodi) August 15, 2023
దేశం లో విస్తృతమైన ఆరోగ్య రక్షణ కవచాన్ని అందించే ప్రయత్నాల ను మెరుగు పరచడం కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రయాసల ను ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ లో 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి ని పెట్టిందని, దీని ద్వారా బిపిఎల్ కుటుంబాల కు 5 లక్షల రూపాయల వరకు వార్షిక స్వాస్థ్య హామీ లభిస్తోందన్నారు.
200 करोड़ वैक्सिनेशन का काम हमारी आंगनवाड़ी वर्कर, आशा वर्कर, हेल्थ वर्कर ने करके दिखाया है।#IndependenceDayIndia pic.twitter.com/3uzC6LPL3a
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) August 15, 2023
ఈ సందర్భం లో దేశ ప్రజల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, 200 కోట్ల కు పైగా కోవిడ్ టీకాకరణ సంబంధి ప్రశంసనీయమైనటువంటి కార్యసాధన లో ఆరోగ్య రంగ శ్రమికులు అందించిన అనుకరణీయమైనటువంటి తోడ్పాటు ను , ప్రత్యేకించి ఆంగన్ వాడీ కార్యకర్త లు మరియు ఆశా కార్యకర్తల యొక్క సమర్పణ ను మరియు అదే పని గా వారు చేసినటువంటి ప్రయాసల ను ప్రశంసించారు. ‘‘కోవిడ్ కాలం లోను ఆ తరువాతి కాలం లోను ప్రపంచానికి భారతదేశం సాయాన్ని అందించింది, తద్ద్వారా ప్రపంచానికి ఒక మిత్రుని వలె భారతదేశం తన ను తాను ప్రతిష్ఠించుకొన్నది.’’ అని కూడా ఆయన అన్నారు.
ఒక భూమి, ఒక ఆరోగ్యం మరియు ఒక భవిష్యత్తు ల తాలూకు దృష్టికోణాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, ‘‘జన్ ఔషధి కేంద్రాలు 20,000 కోట్ల రూపాయల ను ఆదా చేయడం ద్వారా దేశం లోని మధ్య తరగతి వర్గాల వారికి ఒక క్రొత్త బలాన్ని ఇచ్చాయి.’’ అని పేర్కొన్నారు. దేశం లో రాబోయే రోజుల లో జన్ ఔషధి కేంద్రాల ప్రస్తుత సంఖ్య ను 10,000 నుండి పెంచి 25,000 కేంద్రాలు గా చేయాలి అనేటటువంటి లక్ష్యం దిశ లో కృషి జరుగుతోందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.
***
Addressing the nation on Independence Day. https://t.co/DGrFjG70pA
— Narendra Modi (@narendramodi) August 15, 2023
200 करोड़ वैक्सिनेशन का काम हमारी आंगनवाड़ी वर्कर, आशा वर्कर, हेल्थ वर्कर ने करके दिखाया है।#IndependenceDayIndia pic.twitter.com/3uzC6LPL3a
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) August 15, 2023