ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 12 వ తేదీ నాడు మధ్య ప్రదేశ్ ను సందర్శించనున్నారు. మధ్యాహ్నం పూట సుమారు గా 2 గంటల 15 నిమిషాల వేళ కు ఆయన సాగర్ జిల్లా కు చేరుకొని, అక్కడ సంత్ శిరోమణి గురుదేవ్ శ్రీ రవిదాస్ జీ స్మారక స్థలం లో భూమి పూజ ను నిర్వహిస్తారు. ప్రధాన మంత్రి మధ్యాహ్నం దాదాపు గా 3 గంటల 15 నిమిషాల వేళ కు ధన లో జరిగే ఒక సార్వజనిక కార్యక్రమం లో పాలుపంచుకొంటారు. అక్కడ ఆయన సంత్ శిరోమణి గురుదేవ్ శ్రీ రవిదాస్ జీ స్మారకానికి శంకుస్థాపన చేస్తారు.
ప్రముఖ సాధువుల ను మరియు సమాజ సంస్కర్తల ను ఆదరించడం ప్రధాన మంత్రి చేపడుతున్న కార్యక్రమాల లో ఒక విశిష్టత గా ఉంది. ఆయన యొక్క ఈ దృష్టి కోణం నుండి ప్రేరణ నుపొంది, సంత్ శిరోమణి గురుదేవ్ శ్రీ రవిదాస్ జీ స్మారకాన్ని 11.25 ఎకరాల పైచిలుకు విస్తీర్ణం లో వంద కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో నిర్మించడం జరుగుతుంది. ఈ భవ్యమైన స్మారకం లో సంత్ శిరోమణి గురుదేవ్ శ్రీ రవిదాస్ జీ యొక్క జీవనం, ఆయన ఆలోచన విధానం మరియు బోధన ల ను కళ్లకు కట్టే ఆకర్షణీయమైనటువంటి కళాకృతుల సంగ్రహాలయం తో పాటు ఒక చిత్రశాల కూడా ఉంటుంది. దీనిలో స్మారకానికి విచ్చేసే భక్తజనానికై నివాసాలు, భోజనాలయం వంటి సదుపాయాలు కూడా ఏర్పాటు అవుతాయి.
ఇదే కార్యక్రమం లో భాగం గా, ప్రధాన మంత్రి 4,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన రైలు మరియు రహదారి రంగ సంబంధి వివిధ ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడంతో పాటుగా దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు.
ప్రధాన మంత్రి ఈ పథకాన్ని కోటా-బీనా రైలు మార్గం యొక్క డబ్లింగ్ కు ప్రతీక గా దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. సుమారు 2475 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో తయారైన ఈ ప్రాజెక్టు రాజస్థాన్ లో కోటా మరియు బారాఁ జిల్లా లు మరియు మధ్య ప్రదేశ్ లో గుణ, అశోక్ నగర్, ఇంకా సాగర్ జిల్లా ల గుండా సాగుతుంది. అదనపు రైలు మార్గాల ద్వారా మెరుగైన గతిశీలత సామర్థ్యం అందుబాటులోకి రావడం తో పాటు మరి ఆ మార్గం లో రైళ్ల ప్రయాణ వేగాన్ని మెరుగపరచడం లో తోడ్పాటు లభించనుంది.
ప్రధాన మంత్రి 1580 కోట్ల రూపాయల కు పైచిలుకు వ్యయం తో నిర్మాణం కాబోయే రెండు రహదారి పథకాల కు శంకుస్థాపన చేస్తారు. వీటిలో మోరీకోరీ – విదిశ – హినోతియా ను కలుపుతూ సాగే నాలుగు దోవల రోడ్డు ప్రాజెక్టు మరియు హినోతియా ను మెహ్ లువా తో కలిపే రోడ్డు ప్రాజెక్టు లు భాగం గా ఉన్నాయి.
***