Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్/సీఈవో శ్రీ సంజయ్ మెహ్రోత్రాతో ప్రధానమంత్రి భేటీ


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో మైక్రాన్‌ టెక్నాలజీ ప్రెసిడెంట్/సీఈవో శ్రీ సంజయ్ మెహ్రోత్రాతో సమావేశమయ్యారు. భారతదేశంలో సెమీకండక్టర్ తయారీ పర్యావరణ వ్యవస్థ బలోపేతం దిశగా ఆ సంస్థ ప్రణాళికలపై ఈ సందర్భంగా వారు చర్చించారు.

దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“శ్రీ సంజయ్‌ మెహ్రోత్రా @MicronTech ప్రెసిడెంట్/సీఈవో గాంధీనగర్‌లో ప్రధానమంత్రి @narendramodiని కలుసుకున్నారు. భారతదేశంలో సెమీకండక్టర్ తయారీ పర్యావరణ వ్యవస్థ బలోపేతం చేసేదిశగా ఆ సంస్థ ప్రణాళికలపై వారు ఈ సందర్భంగా చర్చించారు” అని పేర్కొంది.