Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కాన్ ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సిఒపి) టు ది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్ వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (యుఎన్ఎఫ్ సిసి) లో శీతోష్ణ స్థితి మార్పు సంప్రదింపుల సందర్భంగా భారతదేశం అనుసరించిన వైఖరికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి


మొరక్కో లోని మరాకేశ్ లో 2016 నవంబర్ 7-18 తేదీల మధ్య జరిగిన కాన్ ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సిఒపి) టు ది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్ వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (యుఎన్ఎఫ్ సిసి) లో శీతోష్ణ స్థితి మార్పు సంబంధ సంప్రదింపుల సందర్భంగా భారతదేశం అనుసరించిన వైఖరికి మంత్రిమండలి ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

సిఒపి లో జరిగిన శీతోష్ణ స్థితి మార్పు సంబంధ సంప్రదింపుల సందర్భంగా భారతదేశం అవలంబించిన వైఖరికి ఆమోదం తెలపడంలో ఉద్దేశమల్లా పేదలు మరియు దుర్బల వర్గాల ప్రయోజనాలను పరిరక్షించడంతో పాటు రూపాంతరణం, నష్టాలను స్పష్టపరచడం మరియు డెవలప్ మెంట్ స్పేస్ ను కాపాడడం కూడాను. దేశంలోని సమాజ శ్రేణులన్నింటి మేలు ఇందులో ఇమిడివుంది.

ఏ దేశం వృద్ధి, అభివృద్ధి అయినా గ్రీన్ హౌస్ ఉద్గారాలతో ముడిపడివుంటుంది. శీతోష్ణ స్థితి మార్పు దుష్ప్రభావాలపైన పోరు సల్పుతూనే, భారతదేశంలో మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలలో డెవలప్ మెంట్ స్పేస్ ను పరిరక్షించుకోవలసిన అవసరం ఉంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి పత్రంలో ఉల్లేఖించిన వైఖరి దోహదం చేస్తుంది. అలాగే, దేశం యొక్క రూపాంతరణ అవసరాలను కూడా ఇది నెరవేర్చుతుంది.