లోకమాన్య తిలక్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. వారి అసమాన ధైర్యసాహసాలు, వీరోచిత పోరాటం, స్వాతంత్య్ర ఉద్యమంలో
అంకిత భావం వంటివి దేశప్రజలకు ఎల్లవేళలా ప్రేరణగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్బంగా ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేస్తూ,
“ పూర్ణ స్వరాజ్ డిమాండ్‌తో విదేశీ పాలనకు చరమగీతం పాడిన అమర వీరుడు లోకమాన్య తిలక్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి కోటి కోటి వందనాలు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆయన చూపిన ధైర్యం,
జరిపిన పోరాటం, అంకితభావం దేశప్రజలకు ఎల్లవేళలా స్ఫూర్తిదాయకం గా నిలుస్తుంది ”అని పేర్కొన్నారు.
पूर्ण स्वराज की मांग से विदेशी हुकूमत की नींव हिलाने वाले देश के अमर सेनानी लोकमान्य तिलक को उनकी जन्म-जयंती पर कोटि-कोटि नमन। आजादी के आंदोलन में उनके साहस, संघर्ष और समर्पण की कहानी देशवासियों को सदा प्रेरित करती रहेगी।
— Narendra Modi (@narendramodi) July 23, 2023