పోర్ట్ బ్లేయర్ లోని వీర్ సావర్ కర్ అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క నూతన ఇంటిగ్రేటెడ్ టర్మినల్ బిల్డింగు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జులై 18 వ తేదీ నాడు ఉదయం పూట 10:30 గంటల వేళ లో వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభించనున్నారు.
సంధానం సంబంధి మౌలిక సదుపాయాల కల్పన ను పెంపొందింప చేయడం అనేది ప్రభుత్వం యొక్క ప్రాధాన్యం గా ఉంటోంది. క్రొత్త ఏకీకృత టర్మినల్ భవనాన్ని నిర్మించడానికి సుమారు గా 710 కోట్ల రూపాయలు వెచ్చించడమైంది. ఈ క్రొత్త టర్మినల్ ఈ కేంద్ర పాలిత ప్రాంతం లో సంధానాన్ని వృద్ధి చెందింప చేయడం లో కీలక పాత్ర ను పోషిస్తుంది. ఇంచు మించు 40,800 చదరపు మీటర్ ల మొత్తం నిర్మాణ క్షేత్రాన్ని కలిగివున్న ఈ క్రొత్త టర్మినల్ భవనం ప్రతి సంవత్సరం ఇంచుమించు 50 లక్షల యాత్రికుల రాక పోకల ను సంబాళంచగలిగే సామర్థ్యాన్ని కలిగివుంటుంది. పోర్ట్ బ్లయర్ విమానాశ్రయం లో బోయింగ్-767- 400 రకం విమానాలు రెండు మరియు ఎయర్ బస్-321 రకం విమానాలు రెండు ఆగేందుకు అనువుగా ఉండే ఒక ఏప్రన్ ను 80 కోట్ల రూపాయల ఖర్చు తో ఈ నిర్మించడం జరిగింది. దీని ద్వారా ఈ విమానాశ్రయం ఇక ఏక కాలం లో పది విమానాల ను నిలిపి ఉంచే సామర్థ్యాన్ని కలిగివుంటుంది.
ప్రకృతి నుండి ప్రేరణ ను పొందిన దీని వాస్తుశిల్ప రచన సముద్రాన్ని మరియు దీవుల ను కళ్ళకు కడుతూ, ఒక శంఖం యొక్క ఆకారం లో కనుపిస్తుంటుంది. క్రొత్త విమానాశ్రయం యొక్క భవనం లో వేడిమి ప్రభావాన్ని తగ్గించడం కోసం డబల్ ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్, భవనం లోపల కృత్రిమ ప్రకాశాన్ని ఉపయోగించడాన్ని తగ్గించడం కోసం మరియు తగినంత మోతాదు లో సూర్య కాంతి వీలైనంత ఎక్కువ స్థాయి లో ప్రవేశించడం కోసం స్కైలైట్స్ ఏర్పాటు, ఎల్ఇడి లైటింగ్, వేడిమి ని తగ్గించే గ్లేజింగ్ వంటి స్థిరత్వం కలిగిన అనేకమైన ప్రత్యేకత లు ఉన్నాయి. ఈ భవనం లో ఏర్పాటు చేసిన అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకు లో వాన నీటి ని ఒడిసిపట్టడం జరుగుతుంది. వ్యర్థ జలాల ను పూర్తి గా శుద్ధి చేసి లేండ్ స్కేపింగ్ కోసం తిరిగి ఉపయోగం లోకి తీసుకు రావడం తో పాటుగా ఆన్- సైట్ సీవేజి ట్రీట్ మెంట్ ప్లాంటు మరియు 500 కిలోవాట్ సామర్థ్యం కలిగిన సౌర శక్తి ప్లాంటు కూడా ఈ టర్మినల్ భవనం లో ఇతర విశిష్టతలు గా ఉన్నాయి. ఇవి దీవుల పర్యావరణం పై కనీస స్థాయి ప్రతికూల ప్రభావాఃన్ని కలగజేయనున్నాయి.
ప్రాచీనమైన అండమాన్ మరియు నికోబార్ దీవుల కు ప్రవేశ ద్వారం గా ఉన్నటువంటి పోర్ట్ బ్లేయర్ పర్యటకుల కు చాలా లోకప్రియమైనటువంటి గమ్య స్థలం గా ఉన్నది. ఈ సువిశాలమైన క్రొత్త ఏకీకృత టర్మినల్ గగన తల రాకపోకల ను పెంపొందింప చేయడం తో పాటు గా ఈ ప్రాంతం లో పర్యటన ను వృద్ధి చెందింప చేయడం లో సాయపడనుంది. దీనితో స్థానిక ప్రజల కు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ గా లభించగలవు; అంతేకాదు, ఈ ప్రాంతం యొక్క ఆర్థిక వ్యవస్థ కు ఉత్తేజాన్ని అందించడం లోనూ ఇది సాయపడగలదు.
***