Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యు ఎ ఇ అధ్యక్షుడితో ప్రధాన మంత్రి సమావేశం

యు ఎ ఇ అధ్యక్షుడితో ప్రధాన మంత్రి సమావేశం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జూలై 15న అబుదాబిలో యు ఎ ఇ

అధ్యక్షుడు, అబుదాబీ పాలకుడు షేక్

మహమ్మ ద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో సమావేశం అయ్యారు.

 

వాణిజ్యం, పెట్టుబడులు, ఫిన్ టెక్, ఇంధనం, పునరుత్పాదక ఇంధనం, వాతావరణ కార్యాచరణ, ఉన్నత విద్య, ప్రజల మధ్య సంబంధాలు సహా ద్వైపాక్షిక భాగస్వామ్యంలో వివిధ కోణాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా చర్చించారు.

 

ఇద్దరు నేతల సమక్షం లో రెండు దేశాలు మూడు ముఖ్యమైన అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.

 

సీమాంతర లావాదేవీల కోసం స్థానిక కరెన్సీల (ఐఎన్ఆర్ – ఎ ఇ డి ) వాడకాన్ని ప్రోత్సహించడానికి ఒక ఫ్రేమ్వర్క్ ఏర్పాటు కోసం ఆర్ బి ఐ , యుఎఇ సెంట్రల్ బ్యాంక్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

 

ఆర్ బి ఐ , యుఎఇ సెంట్రల్ బ్యాంక్ ల మధ్య  చెల్లింపు,  సందేశ వ్యవస్థలను అనుసంధానించడంపై ద్వైపాక్షిక సహకారం కోసం అవగాహన ఒప్పందం

కుదిరింది.

 

ఐఐటి ఢిల్లీ – అబుదాబి, యుఎఇ ఏర్పాటు ప్రణాళిక కోసం భారత విద్యా మంత్రిత్వ శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్, అబుదాబి,  ఐఐటి ఢిల్లీ మధ్య మరో అవగాహన ఒప్పందం కుదిరింది.

 

సమావేశం అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. వాతావరణ మార్పులపై ప్రత్యేక సంయుక్త ప్రకటనను కూడా విడుదల చేశారు.

 

***