Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బేస్టిల్ డే పరేడ్ లో గౌరవ అతిథి గాపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

బేస్టిల్ డే పరేడ్ లో గౌరవ అతిథి గాపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి


ఫ్రాన్స్ అధ్యక్షుడు మాన్య శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్ ఆహ్వానించిన మీదట ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జులై 14 వ తేదీ నాడు చేంప్స్ ఎలిసీస్ లో బాస్టీల్ డే పరేడ్ లో గౌరవ అతిథి గా పాల్గొన్నారు.

భారతదేశం-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాని కి 25 సంవత్సరాలు అయిన ఘట్టాని కి సూచిక గా ఒక సైన్య బేండ్ నాయకత్వం లో సేన యొక్క మూడు దళాలతో కూడినటువంటి 241 మంది సభ్యులు గల భారతీయ సాయుధ బలగాల దళం కూడా ను పరేడ్ లో పాలు పంచుకొంది. రాజ్ పుతానా రైఫిల్స్ రెజిమెంట్ తో పంజాబ్ రెజిమెంట్ కలసి భారతీయ సైన్యం యొక్క జట్టు కు నేతృత్వం వహించింది.

పరేడ్ లో భాగం గా నిర్వహించిన ఫ్లయ్ పాస్ట్ లో హాశిమారా యొక్క 101 స్క్వాడ్రన్ నుండి భారతీయ వాయుసేన కు చెందిన రాఫెల్ జెట్ లు పాలుపంచుకొన్నాయి.

ప్రతి ఏటా జులై 14వ తేదీ న, ఫ్రెంచ్ విప్లవం కాలం లో 1789 వ సంవత్సరం జులై 14 వ తేదీ నాడు బేస్టిల్ కారాగారం ముట్టడి యొక్క వార్షిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఇది భారతదేశం మరియు ఫ్రాన్స్.. ఈ రెండు రాజ్యాంగాల కు కేంద్రీయ ఇతివృత్తం గా ఉన్నటువంటి ‘స్వాతంత్ర్యం, సమానత్వం మరియు సోదరభావం’ అనే ప్రజాస్వామిక విలువల కు ప్రతీక గా కూడా ను ఉంటున్నది.

 

***