Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఫ్రాన్స్ గణతంత్రం ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి

ఫ్రాన్స్ గణతంత్రం ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫ్రాన్స్ ప్రధాని ఎలిజాబెథ్ బోర్న్ గారి తో 2023 జులై 13 వ తేదీ నాడు సమావేశమయ్యారు.

నేతలు ఇద్దరు ఆర్థిక అంశాలు, వ్యాపారం, శక్తి, పర్యావరణం, విద్య, మొబిలిటీ, రైల్ వేస్, డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, మ్యూజియాలజి మరియు రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు సహా వేరు వేరు రంగాల లో సహకారాన్ని పెంపొందింప చేసుకోవడం గురించి చర్చించారు.

భారతదేశాని కి మరియు ఫ్రాన్స్ కు మధ్య గల బహుముఖీన సహకారాన్ని మరింత గాఢం గా మలచాలన్న అభిలాష ను ఉభయ పక్షాలు పునరుద్ఘాటించాయి.

 

***