Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ముస్లిమ్ వరల్డ్ లీగ్ యొక్క సెక్రట్రి జనరల్ తోచర్చలు జరిపిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముస్లిమ్ వరల్డ్ లీగ్ యొక్క సెక్రట్రి జనరల్ మాన్య శ్రీ శేఖ్ డాక్టర్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ కరీమ్ అల్-ఇస్సా తో వివిధ ధర్మాల ను అవలంబించే వారి మధ్య సద్భావన ను పెంపొందింప చేయడం, అతివాద సిద్ధాంతాల ను ఎదుర్కోవడం, ప్రపంచ శాంతి ని వృద్ధిపరచడం లతో పాటు భారతదేశాని కి మరియు సౌదీ అరేబియా కు మధ్య గల భాగస్వామ్యాన్ని మరింత గా పెంపు చేయడం అనే అంశాల పై చర్చలు జరిపారు.
 

మాన్య శ్రీ శేఖ్ డాక్టర్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ కరీమ్ అల్-ఇస్సా తమ సమావేశాన్ని గురించి చేసిన ఒక ట్వీట్ కు, ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

 

‘‘ముస్లిమ్ వరల్డ్ లీగ్ యొక్క సెక్రట్రి జనరల్ మరియు ఆర్గనైజేశన్ ఆఫ్ ముస్లిమ్ స్కాలర్స్ కు చైర్ మన్ మాన్య శ్రీ శేఖ్ డాక్టర్ శ్రీ మొహమ్మద్ బిన్ అబ్దుల్ కరీమ్ అల్-ఇస్సా తో భేటీ అయినందుకు సంతోషిస్తున్నాను. వివిధ ధర్మాల ను అవలంబించే వారి మధ్య సద్భావన ను పెంపొందింప చేయడం, అతివాద సిద్ధాంతాల ను ఎదుర్కోవడం, ప్రపంచ శాంతి ని వృద్ధిపరచడం లతో పాటు, భారతదేశాని కి మరియు సౌదీ అరేబియా కు మధ్య గల భాగస్వామ్యాన్ని మరింత గా పెంపు చేయడం అనే అంశాల పై మేం ఒకరి అభిప్రాయాల ను మరొకరి కి తెలియజెప్పుకొన్నాం.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

***

 

DS/TS