Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సమావేశమైన ఫ్రాన్స్అధ్యక్షుని దౌత్య సలహాదారు

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సమావేశమైన ఫ్రాన్స్అధ్యక్షుని దౌత్య సలహాదారు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఫ్రాన్స్ అధ్యక్షుని దౌత్య సలహాదారు శ్రీ ఇమేన్యుయల్ బోన్ ఈ రోజు న సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి త్వరలో ఫ్రాన్స్ ను సందర్శించనుండగా వివిధ రంగాల లో ద్వైపాక్షిక సహకారం పరం గా చోటు చేసుకొంటున్న పురోగతి ని శ్రీ బోన్ ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకు వచ్చారు.

జులై 14 వ తేదీ నాడు జరుగనున్న బేస్టిల్ డే వేడుకల లో గౌరవ అతిథి గా పాలుపంచుకోవాలంటూ అధ్యక్షుడు శ్రీ మేక్రోన్ ఆహ్వానించినందుకు గాను ప్రధాన మంత్రి కృతజ్ఞత ను వ్యక్తం చేశారు.

అధ్యక్షుడు శ్రీ మేక్రోన్ తో హిరోశిమా లో ఇటీవల తాను జరిపిన సమావేశాన్ని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొంటూ, పేరిస్ లో తమ సంభాషణ కోసం ఎదురు చూస్తున్నానన్నారు. ఈ సంభాషణ భారతదేశం-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయగలదన్న అంచనా ఉంది.

 

 

 

***