Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అవినీతి, ఉగ్రవాదం మరియు నల్లధనానికి వ్యతిరేకంగా ప్రస్తుతం జరుగుతున్న యజ్ఞంలో హృదయపూర్వకంగా పాలుపంచుకొంటున్నందుకు ప్రజలకు ప్రణామం అర్పించిన ప్రధాన మంత్రి


నగదు రహిత చెల్లింపులకు మరియు ఆర్థిక లావాదేవీలలో అత్యాధునిక సాంకేతిక విజ్ఞానికి అలవాటుపడాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు

అవినీతికి, ఉగ్రవాదానికి మరియు నల్లధనానికి వ్యతిరేకంగా ప్రస్తుతం జరుగుతున్న యజ్ఞంలో హృదయపూర్వకంగా పాలుపంచుకొంటున్నందుకు భారతదేశ ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్కరించారు. ఆయన తన అభిప్రాయాలను ట్విటర్ లో ఒకదాని తరువాత మరొకటిగా పొందుపరుస్తూ, ప్రభుత్వం తీసుకున్న ‘నోట్ల చలామణిని రద్దు’ నిర్ణయం తాలూకు ప్రయోజనాలను గురించి చెప్పుకొచ్చారు. నగదు రహిత చెల్లింపులను ప్రజలు ప్రోత్సహించాలని, వారి ఆర్థిక లావాదేవీలలో అత్యాధునిక సాంకేతిక విజ్ఞానాన్ని మేళవించాలని కూడా ఆయన కోరారు.

“అవినీతికి, ఉగ్రవాదానికి మరియు నల్లధనానికి వ్యతిరేకంగా ప్రస్తుతం సాగుతున్న యజ్ఞంలో హృదయపూర్వకంగా పాలుపంచుకొంటున్నందుకు భారతదేశ ప్రజలకు ఇదే నా వందనం.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా ఉన్న రైతులకు, వ్యాపారులకు, కార్మికులకు అనేక లాభాలను అందించగలుగుతుంది.

ప్రభుత్వం చేపట్టిన చర్య కొంత మేరకు అసౌకర్యం కలిగిస్తుందని నేను ఎప్పుడూ చెబుతూనే వచ్చాను. అయితే, ఈ స్వల్పకాలిక కష్టం పోను పోను లాభాలకు బాట వేస్తుంది.

గ్రామీణ భారతావని పురోగతిని, మరియు సమృద్ధిని అవినీతి మరియు నల్లధనం ఇక ఎంత మాత్రం కుదించలేవు. మన పల్లెలు వాటికి చెందవలసిన దానిని పొందే తీరాలి.

నగదు రహిత చెల్లింపులకు అలవాటు పడేటందుకు, ఆర్థిక లావాదేవీలలో అత్యాధునిక సాంకేతిక విజ్ఞానాన్ని మిళితం చేసేటందుకు మనం ఒక చరిత్రాత్మక అవకాశాన్ని దక్కించుకొన్నాము.

నా యువ మిత్రులారా, మార్పునకు ప్రతినిధులు మీరు. భారతదేశాన్ని అవినీతి బారి నుండి విముక్తం చేసి, మరిన్ని నగదు రహిత లావాదేవీలు చోటు చేసుకొనేటట్లుగా మీరు జాగ్రత్తలు తీసుకోండి.

మనమంతా కలిసి నల్లధనాన్ని భారతదేశం ఓడించేటట్లు సంకల్పం చెప్పుకోవాలి. ఇది పేదలు, ఈ మధ్యే మధ్యతరగతి స్థాయికి ఎదిగిన వారు, మధ్యతరగతి వారు మరియు భవిష్యత్తు తరాల వారు లాభపడేందుకు తగిన శక్తిని అందించగలుగుతుంది” అని ప్రధాన మంత్రి వివరించారు.