నేశనల్ రిసర్చ్ ఫౌండేశన్ (ఎన్ఆర్ఎఫ్) బిల్లు, 2023 ను పార్లమెంటు లో ప్రవేశపెట్టడాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజు న సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదాన్ని తెలియ జేసింది. ఈ బిల్లు ఆమోదాన్ని పొందిన అనంతరం ఎన్ఆర్ఎఫ్ ను స్థాపించడాని కి బాట ను పరుస్తుంది. ఈ ఫౌండేశన్ భారతదేశం లోని విశ్వవిద్యాలయాలు, కళాశాల లు, పరిశోధన సంస్థ లు మరియు ఆర్ ఎండ్ డి ప్రయోగశాల లు అన్నింటి లో పరిశోధన కు మరియు అభివృద్ధి (ఆర్ ఎండ్ డి) కి అంకురార్పణ, ఎదుగుదల, ప్రోత్సాహం అందజేత ప్రక్రియల తో పరిశోధన మరియు నూతన ఆవిష్కరణ లతో ముడిపడినటువంటి సంస్కృతి ని పెంపొందింప జేస్తుంది.
ఈ బిల్లు కు పార్లమెంటు లో ఆమోదం లభించిన అనంతరం, జాతీయ విద్య విధానం (ఎన్ఇపి) యొక్క సిఫారసుల కు అనుగుణం గా దేశం లో పరిశోధన లకు ఉన్నత స్థాయి వ్యూహాత్మకమైన దిశ ను అందించడం కోసం ఎన్ఆర్ఎఫ్ పేరిట ఒక అత్యున్నత విభాగాన్ని ఏర్పాటు చేయిస్తుంది. ఈ అత్యున్నత విభాగాన్ని మొత్తం అంచనా వ్యయం అయిదేళ్ల లో (2023-28 సంవత్సరాల మధ్య) 50,000 కోట్ల రూపాయలు ఉంటుంది.
ఎన్ఆర్ఎఫ్ కు పరిపాలక విభాగం గా ద డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ ఎండ్ టెక్నాలజీ (డిఎస్ టి) వ్యవహరిస్తుంది. దీనిని వేరు వేరు విభాగాల లో ప్రసిద్ధ పరిశోధకులు మరియు వృత్తి కుశలురు సభ్యులు గా ఉండేటటువంటి ఒక పాలక మండలి పాలిస్తుంది. యొక్క కార్యక్షేత్రం విస్తృతం గా ఉండబోతుంది. దీని ప్రభావం అన్ని మంత్రిత్వ శాఖల పై ఉంటుంది. బోర్డు కు ఎక్స్-అఫీశియో ప్రెసిడెంటు గా ప్రధాన మంత్రి వ్యవహరిస్తారు. మరి అంతేకాకుండా, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం శాఖ ల కేంద్ర మంత్రి, విద్య శాఖ కేంద్ర మంత్రి.. వీరు ఇద్దరు ఎక్స్-అఫీశియో వైస్ ప్రెసిడెంటులు గా ఉంటారు. భారతదేశ ప్రభుత్వాని కి ముఖ్య విజ్ఞాన శాస్త్ర విషయాల సలహాదారు యొక్క అధ్యక్షత న ఏర్పడేటటువంటి ఒక కార్యనిర్వహణ మండలి అనేది యొక్క పనితీరు ను పర్యవేక్షిస్తుంది.
ఎన్ఆర్ఎఫ్ పరిశ్రమ లో, విద్య రంగం లో, ప్రభుత్వ విభాగాల లో మరియు పరిశోధన సంస్థల లో పరస్పరం సహకార ప్రధానమైన కార్యకలాపాల కు దోహదం చేస్తుంది. విజ్ఞాన శాస్త్రం మరియు తత్సంబంధిత మంత్రిత్వ శాఖల కు అదనం గా పరిశ్రమలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వాటి వంతు తోడ్పాటును అందించడం కోసం ఒక ఇంటర్ ఫేస్ మెకానిజమ్ ను ఎన్ఆర్ఎఫ్ ఏర్పరుస్తుంది. పరిశోధన మరియు అభివృద్ధి ఆర్ & డి రంగం లో సహకారాన్ని ప్రోత్సహించడాని కి పరిశ్రమ చేసే వ్యయాన్ని పెంపొందింప చేయడాని కి వీలుగా ఒక నియంత్రణ ప్రక్రియ ను అమలు లోకి తీసుకు రావడం తో పాటు ఒక విధాన పరమైన ఫ్రేమ్ వర్క్ ను ఏర్పాటు చేయడం అనే అంశాల పై కూడా ఇది ప్రత్యేక శ్రద్ధ ను వహిస్తుంది.
పార్లమెంటు లో ఒక చట్టాన్ని చేయడం ద్వారా 2008 వ సంవత్సరం లో నెలకొల్పిన సైన్స్ ఎండ్ ఇంజీనియరింగ్ రిసర్చ్ బోర్డు (ఎస్ఇఆర్ బి) ని కూడా ఈ బిల్లు రద్దు చేసేస్తుంది. దానిని ఎన్ఆర్ఎఫ్ లోకి విలీన పరుస్తుంది. ఎన్ఆర్ఎఫ్ కు ఎస్ఇఆర్ బి యొక్క కార్యకలాపాల కు అదనం గా ఇతర కార్యకలాపాల ను చేపట్టేందుకు కావలసిన ఆజ్ఞాపూర్వక అధికారాలు ధారదత్తం అవుతాయి.
***
Approval of the National Research Foundation Bill will pave the way for bolstering R&D. It will foster innovation and collaboration among academia, industry, and government, a crucial step in realising our vision for a scientifically advanced nation. https://t.co/0lohgIYQDu https://t.co/m8GvzZqypf
— Narendra Modi (@narendramodi) June 28, 2023