Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మత్తుమందులు మరియు సైకోట్రాపిక్ సబ్ స్టన్సెస్ నియంత్రణలో సహకారంపై భారతదేశానికి, థాయ్ లాండ్ కు మధ్య ఎమ్ ఒ యు ను ఆమోదించిన మంత్రిమండలి


మత్తుమందులు, సైకోట్రాపిక్ సబ్ స్టన్సెస్, మరియు వాటి ప్రికర్సర్స్, ఇంకా రసాయనాలు మరియు ఔషధాల దుర్వినియోగాన్ని నియంత్రించడంలో భారతదేశానికి, థాయ్ లాండ్ కు మధ్య అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ ఒ యు)కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

పైన పేర్కొన్న రంగాలలో పరస్పర సహాయం, సహకారం అవసరపడే అన్ని అంశాలను సంబాళించడానికి ఈ ఎమ్ ఒ యు ఒక సమర్థమైన ఫ్రేమ్ వర్క్ లాగా పనిచేస్తుంది. భారతదేశానికి, థాయ్ లాండ్ కు మధ్య సంస్థాగత సమన్వయానికి రంగం సిద్ధం చేస్తుంది. ఈ ఎమ్ ఒ యు ఒకసారి అమలులోకి వచ్చిందంటే, దేశాల మధ్య మత్తుపదార్థాల చేరవేతను ప్రతిబంధించడంలో తోడ్పడగలుగుతుంది.

***