ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జూన్ 27 వ తేదీ నాడు మధ్య ప్రదేశ్ ను సందర్శించనున్నారు.
ప్రధాన మంత్రి ఉదయం పూట దాదాపు గా 10:30 గంటల కు, రాణి కమలాపతి రైల్ వే స్టేశన్ కు చేరుకొని వందే భారత్ రైళ్ళు అయిదింటి కి ప్రారంభ సూచకం గా ఆకుపచ్చటి జెండా ను చూపుతారు. మధ్యాహ్నం పూట సుమారు 3 గంటల వేళ లో ఆయన శాహ్ డోల్ లో జరిగే ఒక సార్వజనిక కార్యక్రమాని కి హాజరు అవుతారు. అక్కడ రాణి దుర్గావతి కి సమ్మానం కార్యక్రమం లో ఆయన పాలుపంచుకొని, సికల్ సెల్ అనీమియ ఎలిమినేశన్ మిశను ను ప్రారంభించనున్నారు; దీనితో పాటు ఆయుష్మాన్ కార్డుల పంపిణీ ని మొదలు పెడతారు. ప్రధాన మంత్రి శాహ్ డోల్ జిల్లా లోని పకరియా గ్రామాన్ని కూడా సందర్శిస్తారు.
భోపాల్ లో ప్రధాన మంత్రి
భోపాల్ లోని రాణి కమలాపతి రైల్ వే స్టేశన్ లో ఏర్పాటు చేసిన ఒక సార్వజనిక కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాల్గొని, అయిదు వందే భారత్ ఎక్స్ ప్రెస్ లకు ప్రారంభ సూచక జెండా ను చూపెడతారు. ఆ అయిదు వందే భారత్ రైళ్ళ లో రాణి కమలాపతి-జబల్ పుర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్; ఖజురాహో-భోపాల్-ఇందౌర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్; మడ్ గాఁవ్ (గోవా)-ముంబయి వందే భారత్ ఎక్స్ ప్రెస్; ధారవాడ-బెంగళూరు వందే భారత్ ఎక్స్ ప్రెస్ లతో పాటు హటియా-పట్ నా వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు ఉన్నాయి.
రాణి కమలాపతి-జబల్ పుర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ మహాకౌశల్ ప్రాంతం (జబల్ పుర్)ను మధ్య ప్రదేశ్ లోని కేంద్రీయ ప్రాంతం (భోపాల్)తో కలుపుతుంది. అంతేకాకుండా భేడాఘాట్, పచ్ మడీ, సత్ పుడా ల వంటి పర్యటక స్థలాల కు కూడా మెరుగైన సంధానం యొక్క లాభం అందనున్నది. ఈ రైలుబండి యొక్క వేగం ఇదే మార్గం లో ప్రస్తుతం అత్యంత వేగం గా నడుస్తున్న రైలు తో పోలిస్తే సుమారు గా ముప్పై నిమిషాలు తీవ్రం గా ఉంటుంది.
ఖజురాహో-భోపాల్-ఇందౌర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్, మాల్ వా ప్రాంతం (ఇందౌర్) మరియు బుందేల్ ఖండ్ ప్రాంతం (ఖజురాహో) లను కేంద్రీయ ప్రాంతం (భోపాల్) తో కలుపనుంది. ఈ రైలు రంగ ప్రవేశం ద్వారా మహాకాలేశ్వర్, మాండూ, మహేశ్వర్, ఖజురాహో, పన్నా ల వంటి మహత్వపూర్ణ పర్యటన స్థలాల కు ప్రయోజనం చేకూరుతుంది. ఈ రైలుబండి ఇదే మార్గం లో ప్రస్తుతం నడుస్తున్న అత్యంత వేగవంతమైన రైలు తో పోలిస్తే ఇంచుమించు రెండున్నర గంటలు వేగం గా నడవనున్నది.
మడ్ గాఁవ్ (గోవా)- ముంబయి వందే భారత్ ఎక్స్ ప్రెస్ గోవా యొక్క ఒకటో వందే భారత్ ఎక్స్ ప్రెస్ కానున్నది. ఈ రైలు ముంబయి లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ నుండి గోవా లోని మడ్ గాఁవ్ స్టేశన్ మధ్య నడుస్తుంది. ఈ రెండు స్థానాల ను కలిపే ప్రస్తుత రైలు వేగం తో పోల్చి చూసినప్పుడు ఈ రైలు ప్రయాణాని కి పట్టే కాలం లో దాదాపు గా ఒక గంట సేపు ను ఆదా చేయడం లో సాయపడుతుంది.
ధారవాడ-బెంగళూరు వందే భారత్ ఎక్స్ ప్రెస్ కర్నాటక లోని ముఖ్య నగరాలు అయినటువంటి ధారవాడ, హుబ్బళ్లి మరియు దావణగెరె లను రాష్ట్ర రాజధాని నగరం బెంగళూరు తో కలుపుతుంది. ఈ రైలుబండి వల్ల యాత్రికుల కు, విద్యార్థుల కు, పారిశ్రామికవేత్తల కు ఎంతో మేలు చేకూరుతుంది. ఈ రైలు ఇదే మార్గం లో ప్రస్తుతం అత్యంత వేగం గా నడుస్తున్న రైలు తో పోల్చి చూసినప్పడు దాదాపు గా అరగంట సేపు అధిక వేగం తో ప్రయాణిస్తుంది.
హటియా-పట్ నా వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఝార్ ఖండ్ మరియు బిహార్ లకు సంబంధించి ఒకటో వందే భారత్ రైలు కానుంది. పట్ నా కు మరియు రాంచీ కి మధ్య కనెక్టివిటీ ని వృద్ధి చెందింప చేసేటటువంటి ఈ రైలు పర్యటకుల కు, విద్యార్థుల కు మరియు వ్యాపారస్తుల కు ఒక వరప్రసాదం గా నిరూపణ కానుంది. ఇది ఈ రెండు స్థలాల ను కలుపుతూ ప్రస్తుతం నడుస్తున్న అత్యంత వేగవంతమైనటువంటి రైలు తో పోలిస్తే సుమారు ఒక గంట ఇరవై అయిదు నిమిషాల ప్రయాణ కాలాన్ని ఆదా చేయడం లో తోడ్పడనుంది.
శాహ్ డోల్ లో ప్రధాన మంత్రి
శాహ్ డోల్ లో జరిగే ఒక సార్వజనిక కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాలుపంచుకొని, నేశనల్ సికల్ సెల్ అనీమియా ఎలిమినేశన్ మిశను ను ప్రారంభించనున్నారు. ఆయన లబ్ధిదారుల కు సికల్ సెల్ జెనెటిక్ స్టేటస్ కార్డుల ను కూడా పంపిణీ చేయనున్నారు.
సికల్ సెల్ వ్యాధి ని కలగజేస్తున్న తీవ్రమైన ఆరోగ్య సంబంధి సవాళ్ళ ను ఎదుర్కోవడం లో దోహదం చేయడం అనేది ఈ మిశన్ యొక్క ధ్యేయం గా ఉంది. ఈ మిశన్ ను ప్రారంభించడం అనేది 2047 వ సంవత్సరాని కల్లా సికల్ సెల్ డిజీజ్ ను ఒక సార్వజనిక ఆరోగ్య సమస్య స్థాయి నుండి పూర్తి గా మటుమాయం చేసే దిశ లో ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రయాసల లో ఒక కీలకమైన మైలురాయి గా నిలవనుంది. నేశనల్ సికల్ సెకిల్ సెల్ అనీమియ మిశన్ ను 2023 కేంద్ర బడ్జెటు లో ప్రకటించడమైంది. దీనిని దేశం లోని 17 రాష్ట్రాల పరిధి లో 278 జిల్లాల లో అమలు చేయడం జరుగుతుంది. ఆ 17 రాష్ట్రాల లో గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఝార్ ఖండ్, ఛతీస్ గఢ్, పశ్చిమ బంగాల్, ఒడిశా, తమిళ నాడు, కర్నాటక, అసమ్, ఉత్తర్ ప్రదేశ్, కేరళ, బిహార్, ఉత్తరాఖండ్ లతో పాటు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు కూడా ఉన్నాయి.
ప్రధాన మంత్రి మధ్య ప్రదేశ్ లో సుమారు 3.57 కోట్ల ‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన’ (ఎబి-పిఎమ్ జెఎవై) కార్డుల ను పంపిణీ చేయడాన్ని ప్రారంభించనున్నారు. ఆయుష్మాన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తం గా పట్టణ సంస్థ లు, గ్రామ పంచాయతీ లు మరియు డెవలెప్ మెంట్ బ్లాకుల లో నిర్వహించడం జరుగుతున్నది. ఆయుష్మాన్ కార్డు ల పంపిణీ కార్యక్రమం సంక్షేమ పథకాల ను లబ్ధిదారుల లో ప్రతి ఒక్కరి కి అందించాలనే ప్రధాన మంత్రి దృష్టికోణాన్ని సాకారం చేసే దిశ లో వేసేటటువంటి ఒక అడుగు అని చెప్పాలి.
ఈ కార్యక్రమం లో ‘రాణి దుర్గావతి గౌరవ్ యాత్ర’ యొక్క ముగింపు సందర్భం లో రాణి దుర్గావతి కి పుష్పాంజలి ని ప్రధాన మంత్రి సమర్పించనున్నారు. ఈ యాత్ర ను రాణి దుర్గావతి యొక్క వీరత్వాని కి మరియు ప్రాణత్యాగానికి ప్రజాదరణ లభించేటట్లు చూడడాని కి మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ద్వారా నిర్వహించడం జరుగుతున్నది. రాణి దుర్గావతి 16 వ శతాబ్దం మధ్య కాలం లో గోండ్ వానా ను ఏలిన రాణి గా ప్రసిద్ధి ని పొందారు. మొఘలుల కు వ్యతిరేకం గా స్వాతంత్య్ర పోరాటాన్ని జరిపినటువంటి ధైర్యం, సాహసాను కలిగిన, భయమన్నదే ఎరుగని అటువంటి యోధురాలి గా ఆమెను ఈనాటికీ ప్రజలు స్మరించుకోవడం జరుగుతున్నది.
పకరియా గ్రామం లో ప్రధాన మంత్రి
ప్రధాన మంత్రి శాహ్ డోల్ జిల్లా లో పకరియా గ్రామాన్ని సందర్శించడం తో పాటు ఆదివాసి సముదాయం యొక్క అగ్రగామి వ్యక్తుల తో, స్వయం సహాయ సమూహాల తో, పిఇఎస్ఎ [పంచాయత్ (ఎక్స్ టెన్శన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్) యాక్టు, 1996] సమితుల యొక్క నేతల తో, విలేజ్ ఫుట్ బాల్ క్లబ్స్ యొక్క సారధుల తో కలసి మాట్లాడుతారు. ఆదివాసి మరియు లోక్ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి వీక్షిస్తారు. అంతేకాకుండా ఆ పల్లె లో రాత్రి కి విందు కార్యక్రమం లో కూడా పాలుపంచుకోనున్నారు.
***