ప్రజాస్వామ్యంలో అంధకారం అలముకున్న రోజులు రాజ్యాంగం ప్రబోధించే విలువలకు పూర్తి విరుద్ధమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
ఈ మేరకు ఎమర్జెన్సీ వార్షిక సంస్మరణ సందర్భంగా ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
“మన ప్రజాస్వామ్య స్ఫూర్తి బలోపేతం కోసం ఎమర్జెన్సీపై పోరాడిన సాహసులందరికీ నా నివాళి. #DarkDaysOfEmergency మన చరిత్రలో అదొక మరపురాని చీకటి దినంగా మిగిలిపోయింది. రాజ్యాంగం ప్రబోధిస్తున్న ఆ విలువలకు ఈ చీకటి రోజులు పూర్తిగా విరుద్ధం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
*****
I pay homage to all those courageous people who resisted the Emergency and worked to strengthen our democratic spirit. The #DarkDaysOfEmergency remain an unforgettable period in our history, totally opposite to the values our Constitution celebrates.
— Narendra Modi (@narendramodi) June 25, 2023