ఆల్ఫాబెట్, గూగుల్ సంస్థల సీఈవో సుందర పిచ్చాయ్ తో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జూన్ 23 న వాషింగ్టన్ డీసీలో సమావేశమయ్యారు. కృత్రిమ మేథ, ఫిన్ టెక్, సైబర్ సెక్యూరిటీ ఉత్పత్తులు, సేవలు, మొబైల్ పరికరాల తయారీ తదితర రంగాలలో మరింత సహకారానికి అవకాశాలు ఆన్వేషించాలని ఈ సందర్భంగా సుందర పిచ్చాయ్ ని ప్రధాని కోరారు.
గూగుల్, భారతదేశంలోని విద్యా సంస్థల మధ్య సహకారం ద్వారా ఆర్ అండ్ డీ , నైపుణ్యాభివృద్ధికి అవకాశాల మీద కూడా ఇద్దరూ చర్చించారు.
*******
PM @narendramodi interacted with CEO of Alphabet Inc. and @Google @sundarpichai. They discussed measures like artificial intelligence, fintech and promoting research and development. pic.twitter.com/ae42p8EIrR
— PMO India (@PMOIndia) June 23, 2023