Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి నేతృత్వాన 9వ వార్షిక అంతర్జాతీయ యోగా దినోత్సవం

ప్రధానమంత్రి నేతృత్వాన 9వ వార్షిక అంతర్జాతీయ యోగా దినోత్సవం


   అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 2023 జూన్‌ 21న న్యూయార్క్‌ నగరంలోని ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రధాన కార్యాలయ ప్రాంగణంలోగల విశిష్ట ‘నార్త్‌ లాన్‌’ (పచ్చిక బయలు)లో నిర్వహించిన వేడుకలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. “వసుధైవ కుటుంబకం కోసం యోగా” ఇతివృత్తంగా అనేక ప్రపంచ దేశాల్లో ఈ ఏడాది యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ‘వసుధైవ కుటుంబకం’ అంటే… ‘ఒకే భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిష్య్తత్తు’ అని అర్థం.

   ఈ కార్యక్రమంపై 115కుపైగా దేశాల్లోని వేలాది ఔత్సాహికులు విశేషంగా స్పందించారు. ఇందులో భాగంగా నిర్వహించిన యోగాభ్యాస ప్రదర్శనలో ప్రవాస భారతీయులు భారీ సంఖ్యలో పాల్గొని కొత్త గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెజ్‌ ఇచ్చిన ఒక వీడియో సందేశాన్ని ప్రదర్శించారు.

   ఐరాస 77వ సర్వ ప్రతినిధి సభ అధ్యక్షుడైన గౌరవనీయ జబా కొరోసి, న్యూయార్క్‌ నగర మేయర్‌ శ్రీ ఎరిక్‌ ఆడమ్స్‌, ఐరాస ఉప ప్రధాన కార్యదర్శి, ఐరాస సుస్థిర ప్రగతి బృందం అధ్యక్షులైన గౌరవనీయ శ్రీమతి అమీనా జె.మొహమ్మద్‌ సహా అన్ని రంగాలనుంచీ  అనేకమంది ప్రముఖులు, వివిధ రంగాల్లో ప్రసిద్ధులైన- దౌత్యవేత్తలు, అధికారులు, విద్యావేత్తలు, ఆరోగ్య నిపుణులు, సాంకేతిక నిపుణులు, పారిశ్రామిక దిగ్గజాలు, మీడియా ప్రముఖులు, కళాకారులు, ఆధ్యాత్మిక నాయకులు, యోగాభ్యాసకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

   ఈ యోగాభ్యాస ప్రదర్శనకు ముందు 2022 డిసెంబరులో ఐరాస భద్రత మండలికి భారత్‌ అధ్యక్షత సందర్భంగా ఆవిష్కరించిన మహాత్మగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి పుష్పాంజలి ఘటించారు. దీంతోపాటు శాంతిస్థాపన స్మారకం వద్ద కూడా ప్రధాని నివాళి అర్పించారు.

*****