Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జనరల్ ఎలక్ట్రిక్ సీఈవో లారెన్స్ కల్ప్ జూనియర్ తో ప్రధాని భేటీ

జనరల్ ఎలక్ట్రిక్ సీఈవో లారెన్స్ కల్ప్ జూనియర్ తో ప్రధాని భేటీ-


ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జనరల్ ఎలక్ట్రిక్ సీఈవో హెచ్. లారెన్స్ కల్ప్ జూనియర్ తో భేటీ అయ్యారు. 

భారతదేశ తయారీరంగంలో దీర్ఘకాల అనుబంధానికి కట్టుబడి ఉండటం పట్ల జీఈ సంస్థకు అభినందనలు తెలియజేశారు. భారతదేశంలో తయారీని ప్రోత్సహించటానికి జీఈ సంస్థ మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి సహకరించటం మీద కల్ప్ జూనియర్ తో ప్రధాని చర్చించారు. 

భారతదేశంలో విమానయాన, పునరుత్పాదక ఇంధన రంగాలలో మరింత పెద్ద పాత్ర పోషించాలని  జీఈ సంస్థను  ప్రధాని ఆహ్వానించారు. 

***