లక్షద్వీప్ లో‘న్యూట్రి గార్డెన్ ప్రాజెక్టు’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ కార్యక్రమం లక్షద్వీప్ ప్రజలు కొత్త విషయాల ను నేర్చుకొంటూ మరి వాటి ని అవలంబించడం పట్ల ఎంతటి ఉత్సాహం తో ఉంటారనేది తెలియ జేసిందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ ను అభి వృద్ధి పరచాలనే లక్ష్యం లో భాగం గా ఈ ప్రాజెక్టు ను ప్రారంభించడం జరిగింది. దీనిలో 1000 కుటుంబాల కు కాయగూర పంటల విత్తనాల ను అందించడమైంది.
దీనికి అదనం గా, 600 రూపాయల కంటే తక్కువ ఆదాయం కలిగిన లక్షద్వీప్ కుటుంబాల లోని మహిళల కు స్వదేశీ జాతుల కు చెందిన 7000 కోళ్ల ను బేక్ యార్డ్ పౌల్ట్రీ స్కీము లో భాగం గా పంపిణీ చేయడం జరిగింది.
లక్షద్వీప్ గవర్నరు ట్వీట్ ల కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ –
‘‘మెచ్చుకోదగినటువంటి ప్రయత్నం, ఉత్తమమైనటువంటి పరిణామం. ఈ కార్యక్రమం లక్షద్వీప్ ప్రజలు కొత్త విషయాల ను నేర్చుకొంటూ మరి వాటి ని అవలంబించడం పట్ల ఎంతటి ఉత్సాహం తో ఉంటారనేది తెలియ జేసింది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
सराहनीय प्रयास, बेहतरीन परिणाम! इस पहल ने दिखाया है कि लक्षद्वीप के लोग नई चीजें सीखने और अपनाने को लेकर कितने उत्साहित रहते हैं। https://t.co/5UFl57RtjK
— Narendra Modi (@narendramodi) June 10, 2023