Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మొట్టమొదటి జాతీయ శిక్షణా సదస్సు ప్రారంభించనున్న ప్రధాని దేశవ్యాప్తంగా ఉన్న సివిల్ సర్వీసుల శిక్షణా సంస్ఠల ప్రతినిధుల హాజరు సివిల్ సర్వెంట్ల శిక్షణ మౌలిక సదుపాయాల పటిష్టానికి, సంస్థల మధ్య సహకారానికి సదస్సు దోహదం


మొట్టమొదటి జాతీయ శిక్షణా సదస్సును ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ ప్రగతి మైదాన్ లోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్ లో  జూన్ 11 ఉదయం పదిన్నరకు  ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.

సివిల్ సర్వీసులలో సామర్థ్య నిర్మాణం ద్వారా పాలనా క్రమాన్ని , విధానాల అమలును మెరుగు పరచాలన్నది ప్రధాని మోదీ తరచూ వెల్లడించే అభిప్రాయం. ఆయన దార్శనికత మార్గదర్శనంలోనే ‘మిషన్ కర్మయోగి’ పేరుతో సివిల్ సర్వీసుల సామర్థ్య నిర్మాణ జాతీయ కార్యక్రమం రూపుదిద్దుకుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సరైన వైఖరి, నైపుణ్యం, జ్ఞానం ఉండేలా సివిల్ సర్వెంట్లను తీర్చిదిద్దటం దీని లక్ష్యం.  ఆ దిశలో మరో అడుగే ఈ సదస్సు.

సామర్థ్య నిర్మాణ కమిషన్  ఆధ్వర్యంలో ఈ జాతీయ శిక్షణా సదస్సు జరుగుతోంది. సివిల్ సర్వీసుల శిక్షణా సంస్థల మధ్య సహకారాన్ని పెంచటం, దేశ వ్యాప్తంగా ఉన్న ఆ సంస్థల మౌలిక వసతులను పరిష్ట పరచటం దీని లక్ష్యం.  

కేంద్ర శిక్షణా సంస్థలు, రాష్ట్ర పరిపాలనా శిక్షణా సంస్థలు, ప్రాంతీయ, మండల శిక్షణా సంస్థలు పరిశోధనా సంస్థలు ప్రతినిధులు దాదాపు 1500  మందికి పైగా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల, స్థానిక ప్రభుత్వాల  సివిల్ సర్వెంట్ల తోబాటు ప్రైవేట్ రంగ నిపుణులు కూడా ఈ చర్చలలో పాల్గొంటారు.

ఈ వైవిధ్య భరితమైన సమావేశంలో అభిప్రాయాల మార్పిడి జరగటంతోబాటు ఎదురవుతున్న  సవాళ్ళను,  అందుబాటులో ఉన్న అవకాశాలను గుర్తించటం, ఆచరణాత్మక పరిష్కారాలు రూపొందించటం, సమగ్రమైన వ్యూహాలతో సామర్థ్య నిర్మాణం జరుగుతాయి.  ఈ సదస్సులో ఎనిమిది బృంద చర్చలు జరుగుతాయి. ఒక్కొక్కటి సివిల్ సర్వీసులకు సంబంధించిన అధ్యాపక అభివృద్ధి, శిక్షణా ప్రభావ అధ్యయనం, వివిధ అంశాల డిజిటైజేషన్ వంటి  ఒక్కో కీలకమైన అంశం మీద చర్చిస్తుంది.