Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అమెరికా పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించాలన్న ఆహ్వానాన్ని మన్నించిన ప్రధాన మంత్రి


అమెరికా పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా సభాపతి కెవిన్ మెకార్తే  ఆహ్వానాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవంగా స్వీకరించారు.  ఇరుదేశాల ప్రజాస్వామ్య విలువలు, ప్రజల మధ్య సంబంధాలు, ప్రపంచ శాంతికి, సుసంపన్నతకు  అంకితభావంతో కట్టుబడి ఉండటం  పునాదిగా   రెండు దేశాల మధ్య సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడటం గర్వకారణమని ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.   

అమెరికా సంయుక్త రాష్ట్రాల పార్లమెంట్ సభాపతి కెవిన్  మెకార్తే  ట్వీట్ కు సమాధానంగా  ప్రధాని ఇలా ట్వీట్ చేశారు:

“కెవిన్ మెకార్తే, మిష్  మెకానెల్, చాలస్ షుమార్, హకీం జెఫ్రీస్ ..సహృదయంతో  మీరందించిన ఆహ్వానానికి ధన్యవాదాలు.  సగౌరవంగా మీ ఆహ్వానాన్ని మన్నిస్తూ పార్లమెంట్  సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి మరీమారు ప్రసంగించే అవకాశం కోసం ఎదురుచూస్తుంటాను.   ఇరుదేశాల ప్రజాస్వామ్య విలువలు, ప్రజల మధ్య సంబంధాలు, ప్రపంచ శాంతికి, సుసంపన్నతకు  అంకితభావంతో కట్టుబడి ఉండటం  పునాదిగా   రెండు దేశాల మధ్య సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడటం గర్వకారణం.”

 

***

DS/TS