Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జూన్ 21 న జరిగే 9 వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రజలకు గుర్తు చేసిన ప్రధాన మంత్రి


జూన్ 21న జరగబోయే 9 వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు గుర్తు చేశారు. మన మానసిక, శారీరక సౌఖ్యాన్ని పెంచే మన పురాతన ఆచారాన్ని వేడుకగా జరుపుకోవటానికి అందరం సిద్ధమవుదామని అన్నారు.   

ఆయుష్ శాఖా మంత్రి చేసిన  ట్వీట్ కు  ప్రధాన మంత్రి ఈ విధంగా స్పందించారు:

“అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కేవలం మూడు వారాలే మిగిలి ఉంది!

మన మానసిక, శారీరక సౌఖ్యాన్ని పెంచే మన పురాతన ఆచారాన్ని వేడుకగా జరుపుకోవటానికి అందరం సిద్ధమవుదాం. ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన సమాజాన్ని నిర్మిద్దాం”  

***

DS/SH