Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

9 ఏళ్ల మోదీ ప్రభుత్వంపై పౌరుల ట్వీట్స్ పంచుకున్న ప్రధాన మంత్రి


తొమ్మిదేళ్ల మోదీ ప్రభుత్వం మీద పౌరులు చేసిన ట్వీట్లను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.2014 తరువాత తమకు ప్రభుత్వం పనితీరు ఎందుకు నచ్చిందో పేర్కొంటూ ఆ ట్వీట్లు  వచ్చాయి.

ప్రధాని ఇలా ట్వీట్ చేశారు;

“ఉదయం నుంచి పౌరులు చేస్తున్న అనేక  ట్వీట్లు చూస్తున్నా. 2014 తరువాత మన ప్రభుత్వం ఎందుకు నచ్చిందో ప్రస్తావిస్తూ ట్వీట్ చేస్తున్నారు. అలాంటి ప్రేమపూర్వక సందేశాలు ప్రజలకోసం మరింత కష్టపడి  పనిచేసేలా చేస్తాయి.”

 

పౌరుల ట్వీట్స్ పంచుకుంటూ ప్రధాని ఇలా అన్నారు:

 

“గడిచిన 9ఏళ్లలో ఎంతో చేశాం. ముందు ముందు ఇంకా ఎంతో చేస్తాం. అమృతకాలంలో బలమైన సుసంపన్నమైన దేశాన్ని నిర్మిస్తాం “

 

“భారత ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వలన ఇవన్నీ సాధించగలిగాం. చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చగాలిగాం. ఇలాంటి అండ వలన వచ్చే బలం అంతా ఇంతా కాదు.”

 

“ఎన్ డీ యే ప్రభుత్వం ప్రజల జీవితాలలో మార్పు తీసుకువచ్చి భారత అభివృద్ధి యాత్రను వేగవంతం చేసింది”

 

“140 కోట్ల భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చగలిగే అవకాశం దక్కటం నాకెంతో ఆనందంగా ఉంది”