Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఫిజీ గణతంత్రం ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి

ఫిజీ గణతంత్రం ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి


ఫోరమ్ ఫార్ ఇండియా-పసిఫిక్ ఐలండ్స్ కోఆపరేశన్ (ఎఫ్ఐపిఐసి) మూడో శిఖర సమ్మేళనం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మే నెల 22వ తేదీ నాడు పోర్ట్ మోరెస్ బీ లో ఫిజీ గణతంత్రం ప్రధాని శ్రీ సిత్వేనీ లిగామామాదా రాబుకా తో సమావేశమయ్యారు. ఇద్దరు నేత ల మధ్య ఇది మొట్ట మొదటి సమావేశం. 2014 వ సంవత్సరం నవంబరు లో ఫిజీ ని తాను సందర్శించిన కాలం లో ఎఫ్ఐపిఐసి ప్రారంభం అయిన సంగతి ని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు. ఆ తరువాత పసిఫిక్ ఐలండ్ కంట్రీస్ (పిఐసి) తో భారతదేశం యొక్క సహకారం నిరంతరం బలోపేతం అయింది అని ఆయన అన్నారు.

 

ఇద్దరు నేత లు రెండు దేశాల మధ్య సన్నిహితమైన మరియు బహు పార్శ్వాల తో కూడిన అభివృద్ధి ప్రధానమైనటువంటి భాగస్వామ్యాన్ని సమీక్షించారు. సామర్థ్య నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, జలవాయు సంబంధి కార్యాచరణ, నవీకరణ యోగ్య శక్తి, వ్యవసాయం, విద్య, ఇంకా ఇన్ ఫర్ మేశన్ టెక్ నాలజీ లు సహా కీలక రంగాల లో చోటు చేసుకొన్న ప్రగతి పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రాంతీయ ఘటన క్రమాల పై నేతలు ఇద్దరు వారి వారి అభిప్రాయాల ను పరస్పరం వెల్లడించుకొన్నారు. బహు పక్షీయ వేదికల లో సహకారాన్ని పటిష్ట పరచుకోవాలి అనే విషయం లోనూ సమ్మతి ని వ్యక్తం చేశారు. ఫిజీ అధ్యక్షుడు శ్రీ రాతూ విలియమ్ మైవాలిలీ కాటోనివెరె తరఫున ప్రధాని శ్రీ రాబుకా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి ఫిజీ గణతంత్రం యొక్క అత్యున్నత సమ్మానం అయినటువంటి ‘ద కంపేనియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ’ (సిఎఫ్) ని ప్రదానం చేశారు. ఈ గౌరవాని కి గాను ఫిజీ ప్రభుత్వాని కి మరియు ఫిజీ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాల ను తెలియ జేశారు. ఈ పురస్కారాన్ని భారతదేశ ప్రజల కు మరియు ఉభయ దేశాల లోను విశిష్టమైనటువంటి మరియు చిర స్థాయి సంబంధాలు నెలకొల్పడం లో ప్రముఖ పాత్ర ను పోషించినటువంటి ఫిజీ – ఇండియన్ కమ్యూనిటీ కి చెందిన తరాల కు అంకితం చేశారు.

 

***