గౌరవనీయులైన అతిధులు, ప్రియమైన స్నేహితులారా,
ముఖ్యమైన అంశంపై కీలక సమావేశం ఏర్పాటు చేసి, సమావేశంలో పాల్గొవాలని భారతదేశాన్ని ఆహ్వానించిన జపాన్ ప్రభుత్వానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
విపత్తుల వల్ల కలిగే నష్టాలు, ప్రమాదాలు తగ్గించడానికి మొత్తం-సమాజ విధానం ప్రాధాన్యతను సెండాయ్, హ్యోగో సమావేశాలు గుర్తించాయి. విపత్తు నివారణ, నష్ట నివారణ అంశాలకు ఆయా దేశాలు ప్రాథమిక బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న విపత్తు ప్రమాదాలను తగ్గించడానికి, భవిష్యత్తులో విపత్తులు సంభవించకుండా చూడడానికి ప్రభుత్వాలు చర్యలు అమలు చేయాల్సి ఉంటుంది.
విపత్తు నిర్వహణ, నివారణ అంశం ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో ప్రాధాన్యతా అంశంగా మారింది. జీ-7, జీ-20 దేశాలు విపత్తు నిర్వహణ, నివారణ అంశానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం దీనికి నిదర్శనం.
21వ శతాబ్దంలో విపత్తు నిర్వహణ, నివారణ అంశంలో ప్రపంచ దేశాలు క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక్కడ నేను రెండు రెండు సవాళ్లను ప్రస్తావిస్తాను.
మొదటి సవాల్ ఆర్థిక పరమైన సవాలుగా ఉంటుంది. విపత్తు ప్రమాదాలను తగ్గించడానికి అవసరమైన నిధులను దేశాలు సమకూర్చుకోవలసి ఉంటుంది. సమతుల్య విధానంలో నిధుల సమీకరణ జరగాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ అంశాన్ని అన్ని దేశాలు గుర్తించాయి. చాలా కాలంగా విపత్తు ప్రతిస్పందన, పునరుద్ధరణ , పునర్నిర్మాణం అంశాలపై మాత్రమే దేశాలు దృష్టి సారించి పని చేసాయి. ప్రస్తుత పరిస్థితుల్లో విపత్తు ప్రమాదాన్ని తగ్గించడం, విపత్తు సంసిద్ధతకు నిధులు సమకూర్చే అంశానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.దీనివల్ల భారీ మొత్తంలో నిధులు అందుబాటులోకి వస్తాయి. దీనితో పాటు క్రింది సంక్లిష్ట సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
1. విపత్తు ప్రమాదాన్ని తగ్గించడానికి కేటాయించిన వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి తగిన సామర్థ్యాన్ని ఏవిధంగా సాధించవచ్చు ? సామర్థ్యం పెంచడానికి సంస్థాగత యంత్రాంగాలు, సాంకేతిక సామర్థ్యం పెరుగుదల, నైపుణ్యాన్ని ఏ మేరకు పెంపొందించుకోవాలి? ఫలితాల అంచనా వేయడం
2. భారీ ప్రమాదాలు (అంటే తరచు సంభవించే ప్రమాదాలు,కొంతమేరకు ప్రభావం చూపే సంఘటనలు) మరియు సమగ్ర ప్రమాదాలు ( తక్కువగా సంభవించే ప్రమాదాలు, ఎక్కువ ప్రభావం చూపే సంఘటనలు) కోసం విత్తు నివారణ నిధులు ఏ విధంగా కేటాయించాలి ? ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్న వారికి సహకారం అందించే విధానం ఏ విధంగా ఉండాలి?
3. అభివృద్ధి ప్రాజెక్టులతో పాటు విపత్తు నిర్వహణ,నిరారణ అంశాలకు ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయించడానికి అనుసరించాల్సి సమతుల్యత విధానం. విపత్తు నిర్వహణ, నివారణ అంశాలకు విడిగా ప్రత్యేకంగా నిధులు కేటాయించడం వల్ల ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలపై ఈ మేరకు ప్రభావం చూపిస్తుంది?. అభివృద్ధి, విపత్తు నిర్వహణ, నివారణ రంగాల మధ్య నిధుల కేటాయింపులో సమతుల్యత ఈ విధంగా సాధించాలి?
విపత్తు నిర్వహణ, నివారణకు సంబంధించి పైన పేర్కొన్న సవాళ్లు ఎదురయ్యే ప్రమాదం ఉంది. తరచూ విపత్తులు ఎదుర్కొంటున్న దేశాలు ఈ సవాళ్ళను ఇప్పటికే ఎదుర్కొంటున్నాయి. సమస్యలు, సవాళ్ల పరిష్కారానికి ప్రపంచ దేశాల మధ్య సహకారం, సమన్వయం అవసరం. వచ్చే వారంలో రెండోసారి సమావేశం కానున్న జీ-20 వర్కింగ్ గ్రూప్ ఈ అంశాలపై దృష్టి సారించి నిధుల సమీకరణ అంశాన్ని చర్చిస్తుంది.
2వ అంశంగా ముందస్తు హెచ్చరిక వ్యవస్థను బలోపేతం చేయడంలో దేశాలు పోషించాల్సిన పాత్ర గురించి నేను ప్రస్తావిస్తాను. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం అనే అంశం చాలా కాలంగా చర్చనీయాంశమైంది. ఈ రంగంలో ప్రవేశించడానికి ప్రైవేట్ రంగానికి చెందిన సంస్థలు ముందుకు వచ్చాయి. రంగాల వారీగా ముందస్తు హెచ్చరిక సేవలు అభివృద్ధి కావడంతో ఈ రంగంలోకి ప్రైవేటు సంస్థలు ప్రవేశించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేశం పోషించాల్సిన పాత్ర ఏ విధంగా ఉండాలి అనే అంశంపై చర్చ జరగాల్సి ఉంటుంది. విపత్తు సంభవించినప్పుడు పర్యవేక్షణ వ్యవస్థ ను ప్రైవేట్ రంగానికి అవుట్సోర్స్ చేయవచ్చా? సమాచార పరిజ్ఞానం అభివృద్ధి ,అమలు చేయడంలో ప్రభుత్వ పాత్ర ఏ మేరకు ఉండాలి? విపత్తుల సమయంలో అవసరమైన ముందస్తు హెచ్చరిక సేవలు తప్పనిసరిగా అందించాలని ప్రైవేటు సంస్థలను ప్రభుత్వం ఆదేశించగలదా ?
నేను పైన గుర్తించిన కొన్ని సవాళ్లకు సులభమైన సమాధానాలు లేవు. అయినప్పటికీ, విపత్తు ప్రమాదాన్ని తగ్గించే విధానంలో పరివర్తనాత్మక మార్పును తీసుకు రావాలంటే ఈ సవాళ్లను ఎదుర్కోక తప్పదు. విపత్తు ప్రమాదాల నిర్వహణ, నివారణకు పటిష్ట చర్యలు అమలు చేసి వాతావరణ మార్పుల వల్ల కలుగుతున్న ప్రమాదాలను ఎదుర్కోవడానికి జరుగుతున్న ప్రయత్నాలు విజయవంతం కావడానికి ఈ చర్యలు ఉపకరిస్తాయి. మన వాతావరణ మార్పుల అనుసరణ ప్రయత్నాలలో రాష్ట్రం మరింత ప్రభావవంతంగా మారడానికి కూడా ఇది సహాయపడుతుంది.
చర్చల్లో పాల్గొనడానికి కార్యాచరణ ప్రణాళిక అమలు చేయడానికి సమిష్టిగా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది.
విపత్తు నిర్వహణ, నివారణ రంగంలో పనిచేస్తున్న వారు తమ పనిలో అత్యుత్తమంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. రాబోయే తరాలకు స్థితిస్థాపకంగా, స్థిరమైన భవిష్యత్తు అందించడానికి ప్రతి ఒక్కరం కలిసి పనిచేద్దాం
ధన్యవాదాలు.
***