సిక్కిం రాష్ట్రావతరణ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సిక్కిం రాష్ట్ర ప్రగతి పయనం నిరంతరం కొనసాగాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“సిక్కింలోని నా సోదరసోదరీమణులకు రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు. అసాధారణ ప్రకృతి సోయగం, శ్రమైక జీవన సౌందర్యం మేళవించిన అద్భుతమైన రాష్ట్రమిది. ఈ రాష్ట్రం వివిధ రంగాల్లో… ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయంలో అపార ప్రగతి సాధించింది. ఇకమీదట కూడా సిక్కిం నిరంతరం అభివృద్ధి పథంలో పయనించాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Statehood Day wishes to my sisters and brothers of Sikkim. This is a wonderful state, blessed with exceptional natural beauty and hardworking people. The state has attained immense progress in various areas notably organic farming. I pray for the continuous development of Sikkim.
— Narendra Modi (@narendramodi) May 16, 2023