Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్ లోని గాంధీనగర్ లో జరిగిన అఖిల్భారతీయ్ శిక్షా సంఘ్ అధివేశన్ లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

గుజరాత్ లోని గాంధీనగర్ లో జరిగిన అఖిల్భారతీయ్ శిక్షా సంఘ్ అధివేశన్ లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయుల సమాఖ్య యొక్క 29 వ ద్వివార్షిక (ప్రతి రెండేళ్లకు ఒక సారి జరిగే) సమావేశం అయినటువంటి ‘అఖిల్ భారతీయ్ శిక్షా సంఘ్ అధివేశన్’’ లో పాలుపంచుకొన్నారు. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శన ను ప్రధాన మంత్రి సందర్శించారు. టీచర్స్ ఆర్ ఎట్ ది హార్ట్ ఆఫ్ ట్రాన్స్ ఫార్మింగ్ ఎడ్ యుకేశన్’ (విద్య రంగం లో చోటు చేసుకొనే మార్పుల లో కేంద్ర స్థానం గురువుల దే) అనేది ఈ సమావేశం యొక్క ఇతివృత్తం గా ఉంది.

 

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, భారతదేశం ఎప్పుడైతే అమృతకాలం లో వికసిత్ భారత్సంకల్పాన్ని తీసుకొని ముందుకు సాగిపోతోందో ఆ కాలం లో గురువులు అందరు భారీ తోడ్పాటుల ను అందించడానికి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని గురించి ప్రముఖం గా ప్రస్తావించారు. ప్రాథమిక ఉపాధ్యాయుల సాయం తో గుజరాత్ ముఖ్యమంత్రి గా విద్య రంగం లో మార్పు చేర్పుల ను తీసుకు వచ్చిన తన అనుభవాన్ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, బడి కి వెళ్ళడం మధ్య లో మానివేసినటువంటి విద్యార్థుల సంఖ్య గుజరాత్ ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ తెలియ జేసినట్లుగా 40 శాతం స్థాయి నుండి 3 శాతం కంటే తక్కువ స్థాయి కి పడిపోయిందని పేర్కొన్నారు. గుజరాత్ లో గురువుల వద్ద నుండి తాను సంపాదించిన అనుభవం జాతీయ స్థాయి లో తనకు సాయపడిందని, మరి అంతేకాకుండా ఒక విధాన పరమైనటువంటి విధి విధానాల రూపకల్పన లో సైతం ఆ అనుభవం దోహద పడిందని ప్రధాన మంత్రి అన్నారు. బాలిక ల కోసం పాఠశాలల్లో టాయిలెట్ లను ఉద్యమం తరహా లో నిర్మించడాన్ని ఈ సందర్భం లో ఆయన ఒక ఉదాహరణ గా పేర్కొన్నారు. ఆదివాసి ప్రాంతాల లో విజ్ఞానశాస్త్రం బోధన ను మొదలు పెట్టడాన్ని గురించి కూడా ఆయన వివరించారు.

 

భారతదేశాని కి చెందిన గురువులంటే ప్రపంచ నాయకుల లో ఉన్న ఉన్నతమైనటువంటి గౌరవ భావాన్ని గురించి కూడా ప్రధాన మంత్రి వివరించారు. విదేశీ ఉన్నతాధికారుల తో తాను భేటీ అయినప్పుడల్లా ఈ కోవ కు చెందిన పలుకుల ను చాలా తరచు గా తాను వింటూ ఉంటానని ఆయన అన్నారు. భూటాన్ రాజు, సౌదీ అరేబియా రాజు మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ ఒ) డైరక్టర్ జనరల్ వారి యొక్క భారతదేశం గురువుల ను గురించి ఎంతో గొప్ప గా మాట్లాడిన సంగతి ని ప్రధాన మంత్రి ఈ సందర్భం లో వివరించారు.

 

ఒక నిత్య విద్యార్థి గా తాను ఉంటూ వస్తుండడం తనకు ఎంతో గర్వకారణం గా అనిపిస్తోంది అని ప్రధాన మంత్రి చెప్తూ, సమాజం లో జరిగే ఏ ఘటన ను అయినా పరిశీలించడాన్ని తాను నేర్చుకున్నట్లు చెప్పారు. గురువుల తో తన అనుభవాల ను గురించి ప్రధాన మంత్రి వెల్లడించారు. 21వ శతాబ్ది తాలూకు వారు మారుతున్న కాలాల లో భారతదేశం యొక్క విద్య వ్యవస్థ, గురువులు, మరియు విద్యార్థులు మారుతున్నారు అని ఆయన అన్నారు. ఇంతకు ముందు వనరుల తో, మౌలిక సదుపాయాల తో సవాళ్ళు ఉండేవి, విద్యార్థులేమో అనేక సవాళ్ళ ను రువ్వే వారు కాదు అని ఆయన అన్నారు. ప్రస్తుతం మౌలిక సదుపాయాల కల్పన పరమైనటువంటి మరియు వనరుల పరమైనటువంటి సవాళ్ళ ను పరిష్కరించడం జరుగుతోంది, విద్యార్థుల లో ఎక్కడ లేని కుతూహలం వ్యక్తం అవుతోంది. ఇటువంటి ఆత్మవిశ్వాసం కలిగిన మరియు భయమేమిటో ఎరుగని అటువంటి విద్యార్థులు గురువు కు సవాలు విసరుతున్నారు. ఆ విద్యార్థులు చర్చ ను సాంప్రదాయకమైన ఎల్ల ల నుండి సరిక్రొత్త దృష్టికోణాల వైపునకు తీసుకు పోతున్నారు అని ప్రధాన మంత్రి అన్నారు. విద్యార్థుల కు అనేక మార్గాల లో సమాచారం లభ్యం అవుతున్న స్థితి లో ఎప్పటికప్పుడు ఒక అడుగు ముందే ఉండవలసిన స్థితి గురువుల కు ఎదురైందని ఆయన అన్నారు. ‘‘ఈ సవాళ్ళ ను గురువులు ఏ విధం గా పరిష్కరించగలరు అనే అంశం పైన మన విద్య వ్యవస్థ యొక్క భవిష్యత్తు ఆధారపడుతుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సవాళ్ళ ను గురువులు వ్యక్తిగతంగా ఎదగడానికి మరియు వృత్తిపరం గా వృద్ధి లోకి రావడానికి తోడ్పడే అవకాశాలు గా చూడాలని ఆయన అన్నారు. ‘‘ఈ సవాళ్ళు మనకు నేర్చుకొనేందుకు, నేర్చుకొన్నవాటి లో కొన్ని విషయాల ను వదలి వేసేందుకు మరియు క్రొత్త విషయాల ను నేర్చుకొనేందుకు అవకాశాన్ని ప్రసాదిస్తాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

విద్యార్థుల కు గురువులు విద్య బోధకులు గా ఉండడంతో పాటుగా వారి కి మార్గదర్శి గాను మరియు వారి ని తీర్చిదిద్దే శిల్పి గాను మారాలి అని ప్రధాన మంత్రి కోరారు. ఏదైనా ఒక పాఠ్య విషయాన్ని కూలంకషం గా అర్థం చేసుకోవడం ఎలాగ అనే విషయాన్ని ప్రపంచం లోని ఏ సాంకేతిక విజ్ఞానం నేర్పజాలదు, మరి సమాచారం అన్ని వైపుల నుండి పెద్ద ఎత్తున లభిస్తూ ఉంటే, ప్రధానమైన విషయం పైన శ్రద్ధ వహించడం విద్యార్థుల కు ఒక సవాలు గా మారిపోతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. విషయాన్ని లోతు గా ఆకళింపు చేసుకోవడం ద్వారా ఒక తర్కబద్ధమైన తీర్మానాని కి చేరుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అని శ్రీ నరేంద్ర మోదీ నొక్కిచెప్పారు. ఈ కారణం గా 21వ శతాబ్ది లో విద్యార్థుల జీవనం లో గురువులు పోషించవలసిన పాత్ర ఇదివరకటి కంటే మరింత అర్ధవంతం గా మారిపోయింది అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రతి ఒక్క తల్లి, తండ్రి వారి పిల్లల కు అత్యుత్తమమైనటువంటి ఉపాధ్యాయులు చదువు చెప్పాలి అనే కోరుకొని మరి వారి ఆశల ను పూర్తి గా వారి మీదే పెట్టుకొంటారు అని ఆయన అన్నారు.

 

గురువు యొక్క ఆలోచన విధానం ద్వారా మరియు గురువు యొక్క ప్రవర్తన ద్వారా విద్యార్థులు ప్రభావితులు అవుతారు అనే విషయాన్ని ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, విద్యార్థులు వారికి బోధిస్తున్నటువంటి సబ్జెక్టు ను అర్థం చేసుకోవడం ఒక్కటే కాకుండా తమ భావాల ను ఇతరుల కు ఏ విధం గా తెలియ జేయాలి, తమ ఆలోచనల ను ఏ విధం గా ఓపిక తో, ధైర్యం గా, ఆప్యాయం గా మరియు దురభిప్రాయాని కి తావు ఇవ్వనటువంటి నడవడిక తో చాటి చెప్పాలనేది కూడా నేర్చుకొంటారు అని ఆయన వివరించారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కు గల ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, బాలల తో కుటుంబ సభ్యులు కాకుండా ఎక్కువ కాలం గడిపేది గురువులే అన్నారు. ‘‘ఒక ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాలు వారి యొక్క బాధ్యత లు ఏమిటనేది గ్రహించినప్పుడు అది దేశం యొక్క భావి తరాల వారి ని మరింత బలోపేతం చేస్తుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

నూతన జాతీయ విద్య విధానాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఆ విధానాన్ని రూపొందించడం లో లక్ష ల కొద్దీ గురువుల తోడ్పాటు లభించడం చూస్తే గర్వం గా ఉంది అన్నారు. ‘‘ప్రస్తుతం భారతదేశం 21వ శతాబ్దం యొక్క అవసరాల కు తగినటువంటి క్రొత్త క్రొత్త వ్యవస్థల ను నిర్మిస్తున్నది. మరి ఈ విషయాన్ని దృష్టి లో పెట్టుకొనే ఒక క్రొత్త జాతీయ విద్య విధానాన్ని రూపొందించడం జరిగింది’’ అని ఆయన అన్నారు. విద్యార్థుల ను కేవలం పుస్తక ప్రధానమైన జ్ఞానాని కి పరిమితం చేసినటువంటి పాత అసందర్భ విద్య వ్యవస్థ స్థానాన్ని జాతీయ విద్య విధానంతాను తీసుకొంది అని ఆయన అన్నారు. ఈ నవీన విధానం అభ్యాస పూర్వకమైనటువంటి అవగాహన పైన ఆధారపడింది అని ఆయన చెప్పారు. ప్రధాన మంత్రి తన చిన్నతనం లో తనకు ఎదురైనటువంటి అనుభవాల ను జ్ఞప్తి కి తెచ్చుకొంటూ, నేర్చుకొనే ప్రక్రియ లో గురువు యొక్క వ్యక్తిగత ప్రమేయం తాలూకు సకారాత్మక ప్రయోజనాల ను నొక్కిచెప్పారు.

 

మాతృభాష లో విద్య బోధన ను గురించిన నిబంధన ను జాతీయ విద్య విధానం లో చేర్చిన అంశాన్ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, భారతదేశం 200 సంవత్సరాల పైబడి బ్రిటిషు వారి పాలన లో ఉండిపోయినప్పటికీ కూడాను ఇంగ్లిషు భాష స్వల్ప జనాభా కే పరిమితం అయింది అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రాంతీయ భాషల లో విద్య బోధన ను గురించి నేర్చుకొన్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఇంగ్లిషు లో విద్య బోధన మెలకువల ను నేర్చుకొన్న ఉపాధ్యాయుల తో పోలిస్తే ఆదరణ కు అంతగా నోచుకోలేదు అయితే ప్రస్తుత ప్రభుత్వం ప్రాంతీయ భాషల లో విద్య బోధన ను ప్రవేశపెట్టి, ఈ స్థితి ని మార్చివేసింది. దీని ద్వారా ప్రాంతీయ భాషల వైపు మొగ్గు చూపే గురువు ల యొక్క కొలువుల ను కాపాడింది అని ఆయన అన్నారు. ‘‘ప్రాంతీయ భాషల లో చదువు చెప్పడానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది, ఇది గురువుల జీవితాల ను సైతం మెరుగు పరుస్తుంది.’’ అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.

 

గురువులు గా మారడం కోసం ప్రజలు చొరవ తీసుకొని ముందడుగు వేసేటటువంటి వాతావరణాన్ని ఏర్పరచవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. గురువు యొక్క హోదా ను ఒక వృత్తి వలె ఆకర్షణీయం గా మలచవలసిన ఆవశ్యకత ను గురించి ఆయన నొక్కిపలికారు. ప్రతి ఒక్క గురువు తన హృదయాంతరాళం లో ఒక విద్య బోధకుడు/విద్య బోధకురాలు గా రూపొందాలి అని ఆయన అన్నారు.

 

ప్రధాన మంత్రి తాను ముఖ్యమంత్రి అయిన సందర్భం లో తన కు రెండు కోరిక లు ఉన్నట్లు గుర్తు కు తెచ్చుకొన్నారు. వాటిలో ఒకటోది, తాను చదివిన బడి లోని తన స్నేహితుల ను ముఖ్యమంత్రి నివాసాని కి రమ్మని పిలవడం, రెండోదేమో తన టీచర్ లు అందరిని సన్మానించడమూను అని ఆయన వివరించారు. ఈ నాటి కి కూడాను తనకు సమీపం లో ఉంటున్న ఉపాధ్యాయుల తో తాను తరచు గా భేటీ అవుతూ ఉన్నట్లు శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. గురువుల కు మరియు విద్యార్థుల కు మధ్య వ్యక్తిగతమైనటువంటి బంధం అనేది అంతకంతకూ క్షీణిస్తున్న సరళి పట్ల ఆయన తన విచారాన్ని వ్యక్తం చేశారు. అయితే క్రీడారంగం లో మాత్రం ఈ యొక్క బంధం ఇప్పటికీ ఇంకా దృఢం గానే ఉంది అని ఆయన అన్నారు. అదే మాదిరి గా, విద్యార్థులు పాఠశాల ను వీడి వెళ్ళిన తరువాత బడి ని మరచిపోతుండడం తో ఆ విద్య సంస్థ తో అనుబంధాన్ని కోల్పోపోతున్నారని ప్రధాన మంత్రి అన్నారు. విద్యార్థుల కు మరియు బడి కి మధ్య దూరం పెరిగిపోతోందని ప్రధాన మంత్రి అన్నారు. విద్య సంస్థ ను ఏ తేదీ న స్థాపించారన్నది విద్యార్థులే కాదు, ఆ విద్య సంస్థ యాజమాన్యాని కి కూడా తెలియడం లేదు అని ఆయన అన్నారు. పాఠశాల యొక్క పుట్టిన రోజు ను వేడుక గా జరుపుకొంటూ ఉంటే గనక అది బడుల కు మరియు విద్యార్థుల కు మధ్య ఏర్పడుతున్న దూరాన్ని తగ్గించగలుగుతుంది అని ఆయన అన్నారు.

 

పాఠశాలల్లో పెడుతున్న భోజనాల ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, బడి లో ఏ ఒక్క విద్యార్థి కూడా పస్తు ఉండకూడదనే ఉద్దేశ్యం తో పూర్తి సమాజం ఒక్క తాటి మీద కు వస్తోందన్నారు. విద్యార్థుల కు వారి మధ్యాహ్న భోజన వేళల్లో ఆహారాన్ని వడ్డించడం కోసం పల్లె ల నుండి పెద్ద వయస్సు వారిని ఆహ్వానించాలి, అది జరిగినప్పుడు బాలలు సంప్రదాయాల ను గురించి తెలుసుకొంటారు, అంతేకాకుండా వడ్డిస్తున్న వంటకాల ను గురించి పెద్ద వారి ని అడిగి తెలుసుకొంటారు అని కూడా ప్రధాన మంత్రి సూచించారు.

 

బాలల్లో ఆరోగ్య సంరక్షణ సంబంధి అలవాటుల ను మనసు లో నాటడాని కి ఇవ్వవలసిన ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఆదివాసి ప్రాంతం లో ఒక ఉపాధ్యాయురాలి యొక్క సేవల ను జ్ఞప్తి కి తెచ్చుకొన్నారు. ఆమె బడి పిల్లల కు చేతి రుమాళ్ళ ను తయారు చేయడం కోసం తన పాత చీర ను చింపి ముక్కలు గా చేసే వారని, వాటి ని బడిపిల్లలు వారి అంగీల కు పిన్నీసు లతో తురాయిలు గా పెట్టుకొనేటట్టు చూసేవారని, వాటి తో ఆ పిల్లలు వారి ముఖాల నో లేక ముక్కు నో తుడుచుకోవడం కోసం ఉపయోగించే వారని ఆయన వివరించారు. ఒక ఆదివాసీ పాఠశాల లో టీచరు విద్యార్థుల కోసం ఒక అద్దాన్ని తీసుకు వచ్చి పెట్టారు, దాంట్లో వారు తాము ఎలా కనపడుతున్నదీ చూసుకొనే వారని మరొక ఉదాహరణ ను కూడా వెల్లడి చేశారు. ఈ చిన్నదైనటువంటి మార్పు, బాలల్లో విశ్వాసాన్ని వర్థిల్లేటట్లు చేసి పెద్ద మార్పు ను తెచ్చిందని ఆయన అన్నారు.

 

ప్రధాన మంత్రి తన ప్రసంగం ముగింపు లో, గురువులు తీసుకువచ్చేటటువంటి ఒక చిన్న మార్పు విద్యార్థుల జీవితాల లో మహత్తరమైన పరివర్తనల ను తీసుకు రాగలుగుతుందన్నారు. గురువు కు అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని ఇస్తున్నటువంటి భారతదేశం యొక్క సంప్రదాయాల ను గురువులు ముందుకు తీసుకు పోతారని మరియు ఒక వికసిత్ బారత్తాలూకు స్వప్నాల ను సాకారం చేస్తారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

 

ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారి లో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, పార్లమెంటు సభ్యుడు శ్రీ సి.ఆర్. పాటిల్, కేంద్ర మంత్రి శ్రీ పురుషోత్తమ్ రూపాలా, సహాయ మంత్రి డాక్టర్ ముంజ్ పరా మహేంద్రభాయీ, అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు శ్రీ రాంపాల్ సింహ్, పార్లమెంటు సభ్యులు మరియు గుజరాత్ ప్రభుత్వం లోని మంత్రులు ఉన్నారు.

****

DS/TS