ఒక లక్ష కు పైబడిన లబ్ధిదారు నమోదుల తో నేశనల్ ఎస్ సి-ఎస్ టి హబ్ స్కీమ్ సాగుతూ ఉండటాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
కేంద్ర మంత్రి శ్రీ నారాయణ్ రాణె ట్వీట్ కు ప్రధాన మంత్రి జవాబిస్తూ, ఎమ్ఎస్ఎమ్ఇ ని బలపరచడం అంటే, సమాజం లో ప్రతి ఒక్క వర్గాన్ని బలపరచడం తో సమానం అని పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,
‘‘అనేకానేక అభినందనలు. ఎమ్ఎస్ఎమ్ఇ రంగాన్ని పటిష్ట పరచడం అంటే దానికి అర్థం సమాజం లోని ప్రతి ఒక్క వర్గాన్ని బలోపేతం చేయడమే. జాతీయ ఎస్ సి-ఎస్ టి హబ్ స్కీము సాధించినటువంటి ఈ సాఫల్యం ఉత్సాహకరమైంది గా ఉంది’’ అని పేర్కొన్నారు.
बहुत-बहुत बधाई! MSME सेक्टर को सशक्त करने का अर्थ है- समाज के हर वर्ग का सशक्तिकरण। राष्ट्रीय SC-ST हब स्कीम की ये सफलता उत्साहित करने वाली है। https://t.co/JdrdSMUyTw
— Narendra Modi (@narendramodi) May 1, 2023