విద్యుత్తు వాహనాల కు ప్రజాదరణ ను పెంచడం కోసం ప్రభుత్వం తీసుకొన్న నిర్దిష్ట చర్య లు ప్రస్తుతం దేశం అంతటా ఫలితాల ను చూపుతున్నాయని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
భారీ పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ మహేంద్ర నాథ్ పాండే ఒక ట్వీట్ లో నెట్ జీరో ఎమిశన్ యొక్క దార్శనికత ఫలితం గా దేశం విద్యుత్తు వాహనాల ను శరవేగం గా అక్కున చేర్చుకొంటోంది అని తెలియ జేశారు.
కేంద్ర మంత్రి ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ
‘‘చాలా ఉత్సాహాన్ని కలిగించేటటువంటి సమాచారం. విద్యుత్తు వాహనాల లోకప్రియత్వాన్ని పెంపొందింప చేయడం కోసం మా ప్రభుత్వం ఏ విధమైన బలమైన నిర్ణయాల ను తీసుకొందో, ఆ నిర్ణయాల ప్రభావం ప్రస్తుతం దేశం అంతటా కనిపిస్తోంది’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
बहुत उत्साहवर्धक जानकारी! इलेक्ट्रिक वाहनों की लोकप्रियता बढ़ाने के लिए हमारी सरकार ने जो ठोस कदम उठाए हैं, उसका असर अब देशभर में दिखने लगा है। https://t.co/7QjGZ9hWMQ
— Narendra Modi (@narendramodi) April 19, 2023