భారతీయులు వాణిజ్యంలో తమ ప్రతిభను, సామర్థ్యాన్ని విశేషంగా చాటుకుంటున్నారని ప్రధాని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మన దేశం 2022-23 ఆర్థిక సంవత్సరంలో 770 బిలియన్ డాలర్ల ఎగుమతులతో కొత్త రికార్డు సృష్టించిందని పేర్కొంటూ కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ చేసిన ట్వీట్‌పై ఆయన స్పందించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“భారతీయులు వాణిజ్యంలో తమదైన ప్రతిభను, సామర్థ్యాన్ని విశేషంగా ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా ఎంతో విశ్వాసంతో, ఉత్సాహంతో భారత్‌వైపు చూస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
The people of India are showcasing their talent and spirit of enterprise. The world is looking towards India with optimism and enthusiasm. https://t.co/IkLyAu1JvF https://t.co/EcFWCE0B5E
— Narendra Modi (@narendramodi) April 14, 2023