Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహాత్మ జ్యోతిబా ఫులే కు ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి


మహా సామాజిక సంస్కరణ వాది మహాత్మ జ్యోతిబా ఫులే కు ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని ఘటించారు. సామాజిక న్యాయ సాధన మరియు దళితున కు సాధికారిత ను కల్పించడం లో శ్రీ జ్యోతిబా ఫులే అందించినటువంటి సమున్నతమైన తోడ్పాటు ను కూడా శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చుకొన్నారు. మహాత్మ జ్యోతిబా ఫులే ను గురించిన తన భావాల ను సైతం శ్రీ నరేంద్ర మోదీ ఒక వీడియో క్లిప్ మాధ్యం ద్వారా వెల్లడించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘మహాత్మ ఫులే జయంతి నాడు ఆయన కు నేను ప్రణామాన్ని ఆచరిస్తున్నాను. మరి సామాజిక న్యాయ సాధన మరియు దళితులకు సాధికారిత ను కల్పించడం లో ఆయన అందించినటువంటి సమున్నతమైన తోడ్పాటు ను నేను స్మరించుకొంటున్నాను. ఆయన యొక్క ఆలోచన లు లక్షల కొద్దీ ప్రజల కు ఆశ ను మరియు శక్తి ని ప్రసాదించేవే.’’ అని పేర్కొన్నారు.

*****

DS/ST