Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్రప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌లో పశుప్రదర్శన.. కిసాన్‌ మేళాపై ప్రధానమంత్రి ప్రశంస


   కిసాన్‌ సమ్మేళనాలు, పశు ప్రదర్శనలు మన రైతాంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌లో నిర్వహిస్తున్న పశుప్రదర్శన, కిసాన్‌ మేళాపై స్థానిక ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ సంజీవ్‌ బల్యాన్‌ ట్వీట్‌పై ప్రతిస్పందిస్తూ పంపిన సందేశంలో:

“ఇది చాలా మంచి ప్రయత్నం! ఇలాంటి కిసాన్ మేళాల నిర్వహణతో మన అన్నదాత సోదరసోదరీమణులు మరింతగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించడంలో ప్రేరణ పొందుతారు. తద్వారా వారి ఆదాయ మార్గాలు కూడా విస్తరిస్తాయి” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

***

DS