Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఏప్రిల్ 8 వ తేదీ మరియు 9 వ తేదీ లలో తెలంగాణ, తమిళ నాడు, ఇంకా కర్నాటక లను సందర్శించనున్నప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 వ సంవత్సరం ఏప్రిల్ 8 వ తేదీ మరియు 9వ తేదీ లలో తెలంగాణ ను, తమిళ నాడు ను మరియు కర్నాటక ను సందర్శించనున్నారు.

ప్రధాన మంత్రి 2023 వ సంవత్సరం లో ఏప్రిల్ 8వ తేదీ నాడు ఉదయం పూట ఇంచుమించు 11 గంటల 45 నిమిషాల వేళ లో సికందరాబాద్ రేల్ వే స్టేశను కు చేరుకొని, సికందరాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రారంభ సూచకం గా పచ్చ జెండా ను చూపెడతారు. మధ్యాహ్నం దాదాపు గా 12 గంటల 15 నిమిషాల వేళ కు ప్రధాన మంత్రి హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఒక సార్వజనిక కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు. అక్కడ ఆయన ఎఐఐఎమ్ఎస్ బీబీనగర్, హైదరాబాద్ కు శంకుస్థాపన చేయనున్నారు. జాతీయ రాజమార్గ సంబంధి పథకాలు అయిదింటి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారు. ఆయన సికందరాబాద్ రేల్ వే స్టేశన్ యొక్క పునర్ అభివృద్ధి సంబంధి పనుల కు శంకుస్థాపన చేయడం తో పాటుగా రేల్ వే లకు సంబంధించిన ఇతర అభివృద్ధి పథకాల ను సైతం దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు.

ప్రధాన మంత్రి మధ్యాహ్నం సుమారు 3 గంట ల వేళ కు చెన్నయి విమానాశ్రయాని కి చేరుకొంటారు. అక్కడ ఆయన చెన్నై విమానాశ్రయం తాలూకు కొత్త ఏకీకృత టర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటల వేళ కు ఎమ్ జిఆర్ చెన్నయి సెంట్రల్ రేల్ వే స్టేశన్ లో ప్రధాన మంత్రి చెన్నయి-కోయంబత్తూరు వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రారంభ సూచకం గా జెండా ను చూపుతారు. అదే కార్యక్రమం లో, ఇతర రేల్ వే పథకాల ను కూడా ఆయన ప్రారంభించనున్నారు. సాయంత్రం పూట 4 గంటల 45 నిమిషాల కు చెన్నయి లో శ్రీ రామకృష్ణ మఠం యొక్క 125 వ వార్షికోత్సవం సందర్భం లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాలుపంచుకోనున్నారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాల కు ప్రధాన మంత్రి చెన్నయి లోని అల్ స్ట్రామ్ క్రికెట్ గ్రౌండ్ లో ఒక సార్వజనిక కార్యక్రమాని కి అధ్యక్షత వహిస్తారు. అక్కడ ఆయన రహదారి పథకాల ను ప్రారంభించడం తో పాటుగా శంకుస్థాపన చేయనున్నారు.

2023 వ సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ నాడు ఉదయం 7 గంటల 15 నిమిషాల వేళ కు ప్రధాన మంత్రి బాందీపుర్ టైగర్ రిజర్వు ను సందర్శిస్తారు. ఆయన ముదుమలై టైగర్ రిజర్వ్ లో తెప్పకాడు ఎలిఫెంట్ కేంప్ ను కూడా చూస్తారు. ప్రధాన మంత్రి ఇంచుమించు 11 గంటల వేళ లో మైసూరు లోని కర్నాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం లో ‘ప్రాజెక్ట్ టైగర్ కు 50 సంవత్సరాలు పూర్తి కావడాన్ని స్మరించుకొనేందుకు నిర్వహించే ఒక కార్యక్రమాన్ని’ ప్రారంభిస్తారు.

తెలంగాణా లో ప్రధాన మంత్రి

ప్రధాన మంత్రి తెలంగాణ లో 11,300 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన ప్రాజెక్టుల ను ప్రారంభించడం తో పాటు శంకుస్థాపన చేస్తారు.

సికందరాబాద్- తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఐటి సిటి, హైదరాబాదు ను భగవాన్ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం అయిన తిరుపతి తో జోడిస్తుంది. ఇది మూడు నెలల స్వల్ప వ్యవధి లోనే తెలంగాణ నుండి ప్రారంభిస్తున్నటువంటి రెండో వందే భారత్ రైలు. ఈ రైలు ఈ రెండు నగరాల మధ్య యాత్ర కు పట్టే కాలాన్ని దాదాపు గా మూడున్నర గంటలు తగ్గించివేయగలదు, అంతేకాకుండా ఈ ఎక్స్ ప్రెస్ మరీ ముఖ్యం గా పుణ్యక్షేత్రాన్ని సందర్శించే ప్రయాణికుల కు ఎంతో ప్రయోజనకరం గా కూడా ఉంటుంది.

సికందరాబాద్ రేల్ వే స్టేశన్ యొక్క పునర్ అభివృద్ధి పనుల ను 720 కోట్ల రూపాయల ఖర్చు తో చేపట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రణాళిక రచన ఎలా ఉంది అంటే విస్తృతమైన మార్పుల ద్వారా ఈ రేల్ వే స్టేశను కు ప్రపంచ స్థాయి సౌకర్యాల తో సౌందర్యభరితమైన ఆకృతి సహితం గా ఒక ప్రతిష్ఠాత్మకమైనటువంటి స్టేశను గా తీర్చిదిద్దడం జరుగుతుందన్నమాట. మెరుగులు దిద్దిన అనంతరం ఈ స్టేశను లో ఒకే చోటు లో ప్రయాణికుల కు అన్ని సౌకర్యాల తో పాటు రెండు అంచెల విశాలమైన కప్పు తో కూడిన ప్లాజా, దానితో పాటు ప్రయాణికుల కు ఇక్కడి నుండి రాకపోకల తాలూకు ఇతర విధాలైన ప్రయాణ సాధనాల వరకు ఎటువంటి అంతరాయాని కి తావు లేనటువంటి లభ్యత ను అందించడం కోసం మల్టీమోడల్ కనెక్టివిటీ సదుపాయం కూడా సమకూర్చడం జరుగుతుంది.

ఇదే కార్యక్రమం లో భాగం గా, ప్రధాన మంత్రి హైదరాబాద్-సికిందరాబాద్ జంట నగరాల సబర్బన్ సెక్శను లో 13 కొత్త మల్టి-మోడల్ ట్రాన్స్ పోర్ట్ సర్వీస్ (ఎమ్ఎమ్ టిఎస్) సేవల కు ప్రారంభ సూచక జెండా ను చూపెట్టనున్నారు. ఈ సేవల తో యాత్రికుల కు వేగవంతమైనటువంటి, సౌకర్యవంతమైనటువంటి మరియు హాయితో కూడినటువంటి ప్రయాణ ఐచ్చికం దక్కనుంది. ప్రధాన మంత్రి సికిందరాబాద్- మహబూబ్ నగర్ ప్రాజెక్టు యొక్క డబ్లింగ్ మరియు విద్యుతీకరణ ప్రాజెక్టు ను కూడా దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. 85 కిలో మీటర్ ల కు పైచిలుకు దూరం వరకు విస్తరించినటువంటి ఈ ప్రాజెక్టు ను సుమారు 1,410 కోట్ల రూపాయల ఖర్చు తో పూర్తి చేయడమైంది. ఈ ప్రాజెక్టు అతుకుల కు తావు లేనటువంటి సంధానాన్ని అందించడం తో పాటు రైళ్ళ సగటు వేగాన్ని పెంచడం లో తోడ్పడనుంది.

హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఒక సార్వజనిక కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాలుపంచుకొని ఎఐఐఎమ్ఎస్ బీబీనగర్, హైదరాబాద్ కు శంకుస్థాపన చేయనున్నారు. ఇది దేశవ్యాప్తం గా ఆరోగ్య సంబంధి మౌలిక సదుపాయాల ను బలోపేతం చేయాలన్న ప్రధాన మంత్రి దృష్టికోణానికి ఒక ప్రమాణం గా ఉంది. ఎఐఐఎమ్ఎస్ బీబీనగర్ ను 1,350 కోట్ల రూపాయల పైచిలుకు ఖర్చు తో అభివృద్ధి పరచడం జరుగుతుంది. విస్తృతమైనటువంటి, నాణ్యభరితమైనటువంటి మరియు సమగ్రమైనటువంటి మూడో దశ ఆరోగ్య సంరక్షణ సేవల ను తెలంగాణ ప్రజల కు వారి ముంగిట్లోనే అందించడం లో ఎఐఐఎమ్ఎస్ బీబీనగర్ ఒక ముఖ్యమైనటువంటి మైలురాయి గా నిలువబోతున్నది.

ప్రధాన మంత్రి ఇదే కార్యక్రమం లో 7,850 కోట్ల రూపాయల కు పై చిలుకు విలువ కలిగిన జాతీయ రాజమార్గ పరియోజనల కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ రహదారి పరియోజన లు తెలంగాణ లో, ఆంధ్ర ప్రదేశ్ లో రహదారి సంధానాన్ని పటిష్ట పరచనున్నాయి. దీనికి తోడు, ఆయా ప్రాంతాల లో సామాజికమైనటువంటి, మరియు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి లో ఈ ప్రాజెక్టు లు సహాయకారి కానున్నాయి.

తమిళ నాడు లో ప్రధాన మంత్రి

1260 కోట్ల రూపాయల ఖర్చు తో అభివృద్ధి చేసిన చెన్నయి ఇంటర్ నేశనల్ ఎయర్ పోర్ట్ యొక్క కొత్త ఏకీకృత టర్మినల్ భవనం (ఒకటో దశ) ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఈ కొత్త ఏకీకృత టర్మినల్ భవనం జత పడడం తో విమానాశ్రయ ప్రయాణికుల సేవల సామర్థ్యం ప్రతి ఒక్క సంవత్సరానికి 23 మిలియన్ ప్రయాణికుల (ఎమ్ పిపిఎ) నుండి పెరిగిపోయి 30 ఎమ్ పిపిఎ కు చేరుకోనుంది. కొత్త టర్మినల్ స్థానిక తమిళ సంస్కృతి కి ఒక ఆకర్షక ప్రతిబింబం గా రూపుదిద్దుకొంది. దీని లో కోలమ్, చీర, దేవాలయం మరియు ప్రాకృతిక పరిసరాల ను కళ్ళ కు కట్టేటటువంటి ఇతర అంశాలు కూడా జోడించడం జరిగింది.

 

ఎమ్ జిఆర్ చెన్నయి సెంట్రల్ రేల్ వే స్టేశను లో జరగనున్న ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాల్గొని చెన్నయి-కోయంబత్తూరు వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రారంభ సూచకంగా ఆకుపచ్చటి జెండా ను చూపనున్నారు. ఆయన తాంబరం మరియు సేన్ గొట్టయి ల మధ్య రాక పోక లను జరిపే ఎక్స్ ప్రెస్ సర్వీసు కు కూడా ప్రారంభ సూచక జెండా ను చూపుతారు. ఆయన తిరుథురయిపూండి-అగస్థియామ్ పల్లి డిఇఎమ్ యు సర్వీసు కు కూడా ప్రారంభ సూచక ఆకుపచ్చటి జెండా ను చూపెడతారు. ఈ డిఇఎమ్ యు సర్వీసు కోయంబత్తూరు, తిరువారూర్ మరియు నాగాపట్టినమ్ జిల్లా ల ప్రయాణికుల కు ప్రయోజనకరం గా ఉంటుంది.

ప్రధాన మంత్రి తిరుథురయిపూండీ మరియు అగస్తియామ్ పల్లి ల మధ్య 37 కిలో మీటర్ ల పొడవైన గేజ్ కన్ వర్శన్ సెక్శను ను కూడా ప్రారంభిస్తారు. ఈ సెక్శను ను 294 కోట్ల రూపాయల ఖర్చు తో పూర్తి చేయడమైంది. ఇది నాగపట్టినం జిల్లాల లోని అగస్తియామ్ పల్లి నుండి ఖాద్య లవణం మరియు పారిశ్రామిక లవణం ల రవాణా కు దోహద పడనుంది.

చెన్నయి లో శ్రీ రామకృష్ణ మఠం యొక్క 125 వ వార్షికోత్సవాన్ని స్మరించుకొనేందుకు నిర్వహించే కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాలుపంచుకోనున్నారు. స్వామి రామకృష్ణానంద గారు 1897వ సంవత్సరం లో చెన్నై లో శ్రీ రామకృష్ణ మఠాన్ని ఆరంభించారు. రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిశన్ లు వివిధ రూపాల లో మానవతావాది సేవ లు మరియు సామాజిక సేవల తో ముడిపడిన కార్యక్రమాల లో నిమగ్నం అయిన ఆధ్యాత్మిక సంస్థ లు కావడం గమనార్హం.

చెన్నయి లోని అల్ స్ట్రామ్ క్రికెట్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఒక సార్వజనిక కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాలుపంచుకొని దాదాపు గా 3700 కోట్ల రూపాయల విలువైన రహదారి పథకాల ను ప్రారంభించడం తో పాటు శంకుస్థాపన కూడా చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల లో మదురై పట్టణం లో 7.3 కిలో మీటర్ ల పొడవైన ఎలివేటెడ్ కారిడర్ యొక్క ప్రారంభోత్సవం తో పాటు జాతీయ రాజమార్గం 785 లో భాగం అయిన 24.4 కిలోమీటర్ ల పొడవైన నాలుగు దోవ ల రహదారి కూడా కలిసి ఉంది. ప్రధాన మంత్రి జాతీయ రాజమార్గం-744 కి సంబంధించిన కొన్ని రోడ్డు ప్రాజెక్టు ల నిర్మాణాని కి శంకుస్థాపన కూడా చేయనున్నారు. 2400 కోట్ల రూపాయల పైచిలుకు విలువ కలిగిన ఈ ప్రాజెక్టు తో తమిళ నాడు మరియు కేరళ ల మధ్య అంతర్ రాష్ట్ర సంధానం మెరుగు పడడం తో పాటు మదురై లోని మీనాక్షి దేవాలయం, శ్రీవిల్లిపుత్తూర్ లోని ఆండాళ్ దేవాలయం మరియు కేరళ లోని శబరిమల లకు వెళ్లే ప్రయాణికుల కు సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం అందుబాటు లోకి రానుంది.

కర్నాటక లో ప్రధాన మంత్రి

ప్రధాన మంత్రి ఉదయం పూట బాందీపుర్ టైగర్ రిజర్వు ను సందర్శించి, అక్కడి క్షేత్ర సిబ్బంది తోను, అలాగే సంరక్షణ కార్యకలాపాల లో పాలుపంచుకొంటున్న స్వయం సేవ సమూహాల తోను సంభాషించనున్నారు. శ్రీ నరేంద్ర మోదీ ముదుమలై టైగర్ రిజర్వు లో థెప్పకాడు ఎలిఫెంట్ కేంప్ ను కూడా సందర్శిస్తారు. అక్కడి మావటి లతోను, కావడిల తోను ఆయన మాట్లాడుతారు. పులుల అభయారణ్యం యొక్క క్షేత్ర సంచాలకుల తో ప్రధాన మంత్రి ముచ్చటించనున్నారు. వీరు ఇటీవలే ముగిసిన నిర్వహణ సామర్థ్యం సంబంధి ప్రభావశీలత్వ మూల్యాంకనం అభ్యాసం లో అయిదో చక్రం లో అత్యున్నత ఫలితాన్ని సాధించారు.

ఇంటర్ నేశనల్ బిగ్ కేట్స్ అలయన్స్ (ఐబిసిఎ) ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఆసియా ఖండం లో దొంగతనం గా వేటాడడాన్ని మరియు చట్టవిరుద్ధమైన రీతి లో వన్యజీవుల వ్యాపారం పైన కఠినమైన అంకుశాన్ని విధించేటట్టు గా ప్రపంచ నేతల కూటమి ఒకటి ఏర్పడాలి అంటూ ప్రధాన మంత్రి 2019 వ సంవత్సరం జులై లో పిలుపు ను ఇచ్చారు. ప్రధాన మంత్రి సందేశాన్ని ముందుకు తీసుకు పోతూ ఈ అలయన్స్ ను ప్రారంభించడం జరుగుతున్నది. ఇంటర్ నేశనల్ బిగ్ కేట్స్ అలయన్స్ (ఐబిసిఎ) అనేది ఈ ప్రజాతులకు ఆశ్రయాన్ని ఇస్తున్నటువంటి పరిసర దేశాల కు సభ్యత్వం తో పాటు ప్రపంచం లోని ఏడు ప్రముఖ పెద్ద పులులు, అంటే.. పులి, సింహం, చిరుతపులి, మంచు చిరుత, ఫ్యూమా, జాగ్వార్ మరియు చీతా.. ల సంరక్షణ మరియు రక్షణ లపై శ్రద్ధ ను తీసుకొంటుంది.

ప్రధాన మంత్రి ప్రాజెక్ట్ టైగర్ కు 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భాన్ని గుర్తు కు తెచ్చుకొంటూఏర్పాటు చేసిన ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం లో, శ్రీ నరేంద్ర మోదీ పులుల సంరక్షణ కు సంబంధించినటువంటి అమృత కాల దార్శనికత’, పులుల అభయారణ్యాల నిర్వహణ తాలూకు ప్రభావశీల మూల్యాంకనం యొక్క అయిదో చక్రం తాలూకు సారాంశ నివేదిక అనే ప్రచురణల ను ఆవిష్కరించనున్నారు. దీనితో పాటు పులుల సంఖ్య ను కూడా ఆయన ప్రకటించనున్నారు. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేశన్ (5వ చక్రం) యొక్క సారాంశ నివేదిక ను కూడా ఆయన విడుదల చేస్తారు. ప్రాజెక్ట్ టైగర్ కు 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భం లో ఒక స్మారక నాణేన్ని కూడా మంత్రి విడుదల చేస్తారు.

 

 

***