Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మిశన్ అమృత్ సరోవర్ ను ప్రశంసించినప్రధాన మంత్రి


మిశన్ అమృత్ సరోవర్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేశవ్యాప్తం గా అమృత్ సరోవరాల నిర్మాణం ఎంత జోరు గా జరుగుతోందో చూస్తే, అది అమృత కాలం తాలూకు మన సంకల్పాల కు కొత్త శక్తి ని ఇచ్చేది గా ఉంది అని ఆయన అన్నారు.

నలభై వేల కు పైగా అమృత్ సరోవరాల ను దేశ ప్రజల కు అంకితం చేయడం జరిగింది అని జల శక్తి శాఖ కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింహ్ శెఖావత్ ఒక ట్వీట్ లో తెలిపారు. ఏభై వేల అమృత్ సరోవరాల ను 2023 వ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీ కల్లా నిర్మించాలనే లక్ష్యం ఉంది అని కూడా ఆయన అన్నారు.

కేంద్ర మంత్రి ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘చాలా చాలా అభినందన లు. ఎంత వేగం గా దేశం అంతటా అమృత సరోవరాల నిర్మాణం జరుగుతూ ఉన్నదో గమనిస్తే, ఆ జోరు అమృత కాలం కోసం మనం చెప్పుకొన్నటువంటి సంకల్పాల కు కొత్త శక్తి ని సంతరించేది గా ఉంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.