Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భగవాన్మహావీరుని ఉ త్కృష్ట బోధల ను  మహావీర్ జయంతి నాడు స్మరించుకొన్న ప్రధాన  మంత్రి


భగవాన్ మహావీరుని కి మహావీర్ జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రణామాన్ని ఆచరించారు. భగవాన్ మహావీరుల వారు ఒక శాంతియుక్తమైనటువంటి, సద్భావన భరితం అయినటువంటి మరియు సమృద్ధి భరితం అయినటువంటి సమాజాన్ని ఎలాగ నిర్మించుకోవచ్చనే మార్గాన్ని మనకు దర్శింప జేశారు అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో

‘‘భగవాన్ మహావీరుల వారి యొక్క ఉత్కృష్ట బోధల ను మనం స్మరించుకొనేటటువంటి ఒక విశిష్టమైన రోజు ఈ రోజు. శాంతియుక్తం అయినటువంటి, సద్భావన భరితం అయినటువంటి మరియు సమృద్ధి భరితం అయినటువంటి సమాజాన్ని ఎలాగ నిర్మించుకోవచ్చో మనకు ఆయన దర్శింప జేశారు. ఆయన నుండి ప్రేరణ ను పొంది ఇతరుల కు మనం ఎల్లప్పుడూ సేవ చేస్తూ ఉందుము గాక. మరి అలాగే పేదలు , ఆదరణ కు నోచుకోనటువంటి వర్గాల జీవనం లో ఒక సకారాత్మకమైన వ్యత్యాసాన్ని కూడా కొనితెచ్చెదము గాక.’’ అని పేర్కొన్నారు.

****

DS/ST