యోగ మహోత్సవ్ 2023 లో పాలుపంచుకోవాలంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు. 2023 సంవత్సర యోగ అంతర్జాతీయ దినాని కి ఇంకా 100 రోజులు ఉందని స్మరించుకొనేందుకు గాను యోగ మహోత్సవ్ ను మూడు రోజుల పాటు, అంటే 2023 మార్చి నెల 13వ తేదీ మరియు 14వ తేదీ లలో న్యూ ఢిల్లీ లోని తాల్ కటోరా స్టేడియమ్ లోను, మరి అదే విధం గా మార్చి 15వ తేదీ నాడు మొరార్జీ దేసాయి నేశనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ యోగ లోను, నిర్వహించనున్నారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ,
‘‘యోగ దినాని కి ఇంకొక వంద రోజులే మిగిలి ఉంది; దానిని ఉత్సాహం గా పాటించండి అంటూ మీకందరిని నేను కోరుతున్నాను. మరి మీరు గనక యోగ ను మీ జీవనం లో ఒక భాగం గా చేసుకొనకపోయి ఉన్నట్లయితే గనక సాధ్యమైనంత త్వరలో ఆ పని ని చేయవలసింది’’ అంటూ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
**
With a hundred days to go for Yoga Day, urging you all to mark it with enthusiasm. And, if you haven’t made Yoga a part of your lives already, do so at the earliest. https://t.co/8duu7BlUzi
— Narendra Modi (@narendramodi) March 13, 2023