Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకొన్నందుకు ‘నాటు నాటు’ యొక్క పూర్తి జట్టు కు అభినందనలను తెలిపిన ప్రధాన మంత్రి


 

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగం లో ఆస్కార్ పురస్కారాన్ని ఆర్ఆర్ఆర్ చలచిత్రం లోని ‘నాటు నాటు’ పాట కు గాను గెలుచుకొన్నందుకు భారతదేశాని కి చెందిన స్వరకర్త శ్రీ ఎమ్.ఎమ్. కీరవాణి కి, గేయ రచయిత శ్రీ చంద్రబోస్ కు మరియు ఆ పాట కు పని చేసిన పూర్తి జట్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు. ఇది అసామాన్యమైనటువంటిది కావడం తో పాటు గా ‘నాటు నాటు’ ప్రపంచవ్యాప్తం గా లోకప్రియత్వాన్ని సంపాదించుకొంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

 

అకాడమీ ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ –

‘‘అసామాన్యమైంది!’’

‘నాటు నాటు’ యొక్క లోకప్రియత్వం ప్రపంచవ్యాప్తం అయింది. అది ఏళ్ల తరబడి స్మరించుకొనేటటువంటి పాట గా ఉంటుంది. శ్రీయుతులు @mmkeeravaani కి, @boselyricist కు మరియు ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి గౌరవాన్ని అందుకొంటున్న పూర్తి జట్టు కు ఇవే అభినందన లు.

భారతదేశం ఉప్పొంగిపోతోంది మరి గర్వపడుతోంది కూడాను. #Oscars ’’