Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మధ్య ప్రదేశ్ లోని రీవా లో త్వరలో ఒక విమానాశ్రయం ఏర్పాటు కాబోతున్నందుకు అక్కడి ప్రజల కు అభినందనల ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


మధ్య ప్రదేశ్ లోని రీవా జిల్లా లో త్వరలో ఒక విమానాశ్రయం రూపుదాల్చనున్న నేపథ్యం లో అక్కడి ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు. ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నందున రీవా ప్రజలు మరియు ఆ పరిసర ప్రాంతాల లోని ప్రజల జీవనం సులభతరం అవుతుంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

రీవా నుండి పార్లమెంటు లో సభ్యత్వాన్ని కలిగివున్న శ్రీ జనార్దన్ మిశ్ర చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ, ఒక ట్వీట్ లో –

 

‘‘అనేకానేక అభినందన లు. ఈ విమానాశ్రయం రూపుదాల్చడదం తో రీవా మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల జీవనం సులభతరం అవుతుంది. మరి వారు అభివృద్ధి తాలూకు వేగ గతి తో జత పడతారు.’’ అని పేర్కొన్నారు.