శ్రీలంకలో జాఫ్నా సాంస్కృతిక కేంద్రాన్ని ఇవాళ జాతికి అంకితం చేయడం ఒక ముఖ్యమైన కార్యక్రమమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ఇందులో పాల్గొనడంపై ఆయన హర్షం ప్రకటించారు. కాగా, ప్రధానమంత్రి 2015లో ఈ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నేపథ్యంలో ఆ ప్రత్యేక పర్యటన సంబంధిత చిత్రాలు కొన్నిటిని ప్రజలతో పంచుకున్నారు.
ఈ కార్యక్రమం నేపథ్యంలో ఒక ట్వీట్ ద్వారా సందేశమిస్తూ:
“జాఫ్నా సాంస్కృతిక కేంద్రం భారత-శ్రీలంక దేశాల మధ్య సన్నిహిత సాంస్కృతిక సహకారాన్ని సూచించే కీలక కార్యక్రమం. ఇది పెద్ద సంఖ్యలో ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే సగౌరవంతో పాల్గొనడం ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకత తెచ్చిపెట్టింది. జాఫ్నాలో 2015నాటి నా పర్యటన జ్ఞాపకాలు ఎన్నటికీ నాకు గుర్తిండిపోతాయి. జాఫ్నా సాంస్కృతిక కేంద్రానికి నేను అక్కడే పునాది వేశాను. ఇదిగో.. దానికి సంబంధించిన కొన్ని చిత్రాలను చూడండి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
The Jaffna Cultural Center is an important initiative signifying the close cultural cooperation between India and Sri Lanka. It will benefit several people. The august presence of President Ranil Wickremesinghe made the programme even more special. @RW_UNP https://t.co/PP2xbBhMms
— Narendra Modi (@narendramodi) February 11, 2023