ఇతర రాష్ట్రాల కు చెందిన భాష ను నేర్చుకోవాలని ఎల్లవేళలా సూచిస్తూ వస్తున్నటువంటి మరియు తరచు గా స్థానిక భాష లో అభినందనల ను మరియు ఆరంభిక వాక్యాల ను పలుకుతూ తన ప్రసంగాల ను మొదలుపెట్టేటటువంటి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కన్నడ భాష ను నేర్చుకొనే విషయం లో ఒక మనోరంజకమైనటువంటి పద్ధతి ని గురించి ఈ రోజు న వెల్లడించారు.
బొమ్మల సాయం తో కన్నడ వర్ణమాల ను నేర్పించేటటువంటి ఒక పద్ధతి ని గురించి శ్రీ కిరణ్ కుమార్.ఎస్ చేసిన ఒక ట్వీట్ ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ ఒక ట్వీట్ లో –
‘‘భాషల ను నేర్చుకొనే ప్రక్రియ ను ఒక సరదా గా చేసే పని గా మార్చివేసే ఓ సృజనశీలమైన పద్ధతి ఇది.. ఈ సందర్భం సుందరమైన కన్నడ భాష కు సంబంధించింది.’’ అని పేర్కొన్నారు.
A creative way to make learning languages a fun activity, in this case the beautiful Kannada language. https://t.co/OC8XQxh8Sa
— Narendra Modi (@narendramodi) February 6, 2023