Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాని నరేంద్ర మోదీతో ఐరాస 77వ సర్వ ప్రతినిధి సభ అధ్యక్షుడు గౌరవనీయ చాబా కోరొషి సమావేశం

ప్రధాని నరేంద్ర మోదీతో ఐరాస 77వ సర్వ ప్రతినిధి సభ అధ్యక్షుడు గౌరవనీయ చాబా కోరొషి సమావేశం


   క్యరాజ్య సమితి 77వ సర్వ ప్రతినిధి సమావేశం అధ్యక్షుడు (పీజీఏ) గౌరవనీయ చాబా కోరొషి ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

   ఈ సందర్భంగా జలవనరుల నిర్వహణ, పరిరక్షణసహా వివిధ రంగాల్లో భారత సామాజిక పరివర్తన కార్యక్రమాలను కోరొషి ప్రశంసించారు. అలాగే సంస్కరణ సహిత బహుపాక్షికత దిశగా భారతదేశం చేస్తున్న కృషిని శ్రీ చాబా కోరొషి కొనియాడారు. ప్రపంచ వ్యవస్థల సంస్కరణ కృషిలో భారత్‌ ముందంజకుగల ప్రాధాన్యాన్ని కూడా ఆయన నొక్కిచెప్పారు.

   గౌరవనీయ చాబా కోరొషి పదవీ బాధ్యతలు స్వీకరించాక తొలి ద్వైపాక్షిక పర్యటన కోసం భారతదేశాన్ని ఎంచుకోవడంపై ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ప్రపంచ సమస్యలకు శాస్త్ర-సాంకేతిక ఆధారిత పరిష్కారాన్వేషణ పద్ధతిని ‘పీజీఏ’ శ్రీ చాబా కోరొషి అనుసరించడంపై ప్రధాని అభినందనలు తెలిపారు. ఐరాస సర్వప్రతినిధి సభ 77వ సమావేశంతోపాటు 2023లో ఐరాస నిర్వహించే జల సదస్సుకు ‘పీజీఏ’ చేపట్టిన చర్యలకు భారత్‌ పూర్తి మద్దతునిస్తుందని ప్రధాని ఆయనకు హామీ ఇచ్చారు. మరోవైపు సమకాలీన భౌగోళిక-రాజకీయ వాస్తవాల వాస్తవ ప్రతిబింబంగా ఐరాస భద్రతమండలిసహా బహుపాక్షిక వ్యవస్థ సంస్కరణ ప్రాధాన్యాన్ని కూడా ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.

 

******