Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కరియప్ప మైదానంలో జనవరి 28నాటి ‘ఎన్‌సీసీ పీఎం ర్యాలీ’లో ప్రధాని ప్రసంగం


    ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జనవరి 28న సాయంత్రం 5:45 గంటలకు ఢిల్లీలోని కరియప్ప పెరేడ్‌ మైదానంలో నిర్వహించే వార్షిక ‘ఎన్‌సీసీ పీఎం ర్యాలీ’లో ప్రసంగిస్తారు.

   జాతీయ విద్యార్థి సైనిక విభాగం (ఎన్‌సిసి) ఈ ఏడాది 75వ ఆవిర్భావ వార్షికోత్సవం నిర్వహించుకుంటోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి ప్రత్యేక ‘ఆవిర్భావ కవర్‌’తోపాటు ప్రత్యేకంగా రూపొందించిన రూ.75 స్మారక నాణేన్ని కూడా ఆవిష్కరిస్తారు. ఎన్‌సీసీ 75 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకోవడాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. ఈ ర్యాలీ ‘ఒకే భారతం-విశిష్ట భారతం’ ఇతివృత్తంతో పగలు-రాత్రి కార్యక్రమంగా నిర్వహించబడుతుంది. ఇదే ఇతివృత్తంలో సాంస్కృతిక ప్రదర్శన కూడా ఉంటుంది. భారతీయ ‘వసుధైవ కుటుంబకం’ వాస్తవ స్ఫూర్తితో ఈ వేడుకల్లో పాలుపంచుకోవడం కోసం 19 దేశాలనుంచి 196 మంది విద్యార్థి సైనికులు, అధికారులను ప్రతినిధులుగా ఆహ్వానించారు.

 

******